SRH New Jersey: హైదరాబాద్ కొత్త జెర్సీ అదిరింది.. మరి ఈ సీజన్ అయినా రాత మారేనా..?

Published : Feb 09, 2022, 06:49 PM ISTUpdated : Feb 09, 2022, 07:44 PM IST

IPL2022 Auction:  గత సీజన్ లో  అట్టడుగు  నుంచి  మొదటిస్థానంలో ఉన్న హైదరాబాద్.. ఈసారి మెరుగైన ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొత్త కెప్టెన్ గా కేన్ మామ...?   

PREV
18
SRH New Jersey: హైదరాబాద్ కొత్త జెర్సీ అదిరింది.. మరి ఈ సీజన్ అయినా రాత మారేనా..?

ఐపీఎల్ వేలం దగ్గర పడుతున్న తరుణంలో  ఆయా ఫ్రాంచైజీలన్నీ అభిమానులను ఆ దిశగా దృష్టి మళ్లిస్తున్నాయి.  ఇప్పటికే ఐపీఎల్ కు కొత్తగా చేరిన లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలు  ఆయా జట్ల లోగోను, జెర్సీలను ఆవిష్కరించాయి. 

28

తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కూడా వచ్చే సీజన్ కోసం కొత్త సీజన్ ను విడుదల చేసింది. ట్విట్టర్ వేదికగా కేన్ విలియమ్సన్ సేన (?) వేసుకోబోయే జెర్సీలను ఆవిష్కరించింది. 

38

గతంలో మాదిరిగానే.. ఆరెంజ్ కలర్ తో పాటు నలుపు రంగును మిక్స్  చేస్తూ జెర్సీని రూపొందించారు. ఆటగాళ్లు వేసుకునే  షర్ట్ ముందు భాగమంతా ఆరెంజ్ కలర్ ఉండనుంది.

48

ఇక షర్ట్ కు ఉండే చేతులకు  పైన బ్లాక్ కలర్ ఇచ్చి  కిందకు వచ్చేసరికి  మళ్లీ  వాటికి ఆరెంజ్ బార్డర్ వేశారు.  మొన్నటివరకు హైదరాబాద్ జెర్సీల మీద ‘జేకే లక్ష్మీ సిమెంట్‘  జెర్సీ పార్ట్నర్ గా వ్యవహరించగా తాజాగా ఆ స్థానాన్ని ‘కార్స్ 24’ ఆక్రమించింది. 

58

ఇటీవలే కార్స్ 24 సంస్థ.. ఎస్ఆర్హెచ్ తో  ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  ఈ సంస్థకు టీమిండియా మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్. అంతేగాక ఈ సంస్థలో అతడికి పెట్టుబడులు కూడా ఉన్నాయి. 
 

68

2016 లో  ఐపీఎల్  ట్రోఫీ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ గత రెండు సీజన్లుగా  స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. ముఖ్యంగా గత సీజన్ లో అయితే కింది నుంచి  అగ్రస్థానంలో నిలిచింది  సన్ రైజర్స్..

78

హైదరాబాద్ మాజీ సారథి డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం.. కేన్ విలియమ్సన్ ను ద సారథిగా నియమించడం.. ద తర్వాత ఏకంగా  వార్నర్ భాయ్ ను జట్టు నుంచి కూడా పక్కన బెట్టింది ఎస్ఆర్హెచ్.
 

88

కాగా.. కొద్దిరోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో  హైదరాబాద్.. కేన్ విలియమ్సన్ ను రూ. 12 కోట్లతో రిటైన్ చేసుకుంది. కేన్ మామతో పాటు కాశ్మీరి కుర్రాళ్లు అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ లను చెరో రూ. 4 కోట్లతో దక్కించుకుంది.  అయితే కొత్త జెర్సీ తో ఆడనున్న హైదరాబాద్ తలరాత ఈ సీజన్ లో అయినా మారాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

click me!

Recommended Stories