గాయాల సమస్యలు.. స్పిన్ ప్రాక్టీస్
ఈ సిరీస్ ఆడబోయే ప్రస్తుత భారత జట్టులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రమే శ్రీలంకలో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. శ్రీలంకలోని స్పిన్ పిచ్‌లను ఎదుర్కొనేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రాహుల్, జైస్వాల్ ఇప్పటికే ప్రత్యేక ప్రాక్టీస్ మొదలుపెట్టారు. టీమిండియా ప్రాక్టీస్ కోసం హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, తనుష్ కొటియాన్, విప్రాజ్ నిగమ్‌లను నెట్ బౌలర్లుగా తీసుకెళ్లింది. కాగా బుమ్రాతో పాటు హంబ్‌స్ట్రింగ్ గాయంతో వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్టుకు దూరం కాగా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు.
సిరీస్ షెడ్యూల్
• మొదటి టెస్ట్: ఆగస్టు 15 - 19 (గాలే)
• రెండో టెస్ట్: ఆగస్టు 23 - 27 (కొలంబో)
భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంచ్ జైన్, ఆకిబ్ నబీ.