సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో సీనియర్లు ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానే ఘోరంగా ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరూ ఇక రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అంటూ ట్రోలింగ్ మొదలైంది...
తొలి టెస్టులో పెద్దగా పరుగులు చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, రెండో టెస్టులోనూ తన ఫామ్‌ను కొనసాగించాడు... రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 33 బంతులు ఆడి కేవలం 3 పరుగులకే పెవిలియన్ చేరాడు...
210
తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 68 పరుగులు చేసిన అజింకా రహానే... పూజారా అవుటైన తర్వాతి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు..
310
ఈ ఇద్దరూ రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేయలేకపోతే, టీమిండియాలో చోటు కోల్పోవాల్సి ఉంటుందని... ఇదే వారికి చివరి టెస్టు కూడా కావచ్చని కామెంట్ చశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...
410
ఇప్పటికే అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాల సేవలకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక మీరు రిటైర్ అయిపోడంటూ సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...
510
‘అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలను మాత్రమే ఎందుకు ఇలా అంటున్నారు. విరాట్ కోహ్లీ ఏమైనా సెంచరీలు చేస్తున్నాడా? అతను కూడా వీరిలాగే ఆడుతున్నాడు...
610
పరుగులు చేయడానికి విరాట్ ఇబ్బందిపడుతున్నాడని, అతన్ని జట్టు నుంచి తప్పించమని అంటారా? ఎందుకంటే విరాట్ కోహ్లీ కెప్టెన్...
710
అంతేకాకుండా అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారాలతో పోలిస్తే విరాట్ కోహ్లీకి పరుగులు, సెంచరీలు ఎక్కువ. ఈ ఇద్దరినీ విరాట్ కోహ్లీతో పోల్చడం సరికాదు కూడా...
810
అయితే అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఫామ్‌లో ఉన్నప్పుడు ఎవ్వరికీ తక్కువ కాకుండా పరుగులు సాధించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ లేని సమయంలో ఆసీస్ టూర్‌లో ఈ ఇద్దరు సీనియర్లు బాధ్యత తీసుకున్న తీరును మెచ్చుకోకుండా ఉండలేం...
910
న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్టుకి అజింకా రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఆ తర్వాతి టెస్టులో గాయం కారణంగా చోటు కోల్పోయాడు. ఇప్పుడు ఏకంగా అతని స్థానంపైనే ప్రశ్నలు రేగుతున్నాయి..
1010
అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా... ఇప్పుడు సమస్యల్లో ఉన్నారు. అయితే సిరీస్ మధ్యలో మిడిల్ ఆర్డర్‌లో ప్లేయర్లను మార్చడం చాలా పెద్ద విషయం, అది సిరీస్ ఫలితాన్నే మార్చేయొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఆశీష్ నెహ్రా...