IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను రఫ్ఫాడించిన టాప్-5 భారత బ్యాటర్లు

Published : Feb 22, 2025, 12:00 PM IST

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ మరీ ముఖ్యంగా పాకిస్తాన్‌ అంటే చాలు రెచ్చిపోతారు భారత ఆటగాళ్లు. దాయాది పోరులో పాకిస్తాన్ ను తమ బ్యాట్ పవర్ తో రఫ్ఫాడించి అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను రఫ్ఫాడించిన టాప్-5 భారత బ్యాటర్లు

ఫిబ్రవరి 23, ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్‌లు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించాయి. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఉత్కంఠభరితమైన ఛేజింగ్‌ల నుండి ఆధిపత్య ప్రదర్శనల వరకు, ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత బ్యాటర్లు తరచుగా పాకిస్థాన్‌ ను రఫ్ఫాడించారు. మరీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

26

1. రాహుల్ ద్రవిడ్

భారత మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ, పాక్ పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఉన్నాడు. ద్రవిడ్ 71.50 సగటుతో రెండు అర్ధ సెంచరీలతో 143 పరుగులు చేశాడు. 2009లో లో జరిగిన మ్యాచ్ లో  103 బంతుల్లో 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో వికెట్లు పడుతుంటే ద్రవిడ్ వికెట్ కాపాడుకుంటూ పరుగులు చేశాడు. అయితే, పాకిస్తాన్ నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 248 పరుగులకు ఆలౌట్ అయింది. 

36

2. శిఖర్ ధావన్ 

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో శిఖర్ ధావన్ అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా ఉన్నాడు. గబ్బర్ 33 మ్యాచ్‌ల్లో 45.66 సగటుతో 137 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. 2017లో అతని అత్యుత్తమ ప్రదర్శన 65 బంతుల్లో 68 పరుగులు చేశాడు. రోహిత్ శర్మతో కలిసి 136 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంతో భారత్ 50 ఓవర్లలో 319/3 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత బౌలర్ల ధాటికి పాకిస్థాన్‌ 164 పరుగులకే ఆలౌట్ అయింది. 

46
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్

3. విరాట్ కోహ్లీ 

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్ గా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ కోహ్లీ 4 మ్యాచ్‌ల్లో 62 సగటుతో 124 పరుగులు చేశాడు. అందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. 2017లో కోహ్లీ అత్యుత్తమ ఇన్నింగ్స్ ను ఆడాడు. 68 బంతుల్లో 119.11 స్ట్రైక్ రేట్‌తో 81 పరుగులతో అజేయంగా నిలిచాడు. యువరాజ్ సింగ్ (32 బంతుల్లో 53 పరుగులు)తో కలిసి  కోహ్లీ 93 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పడంతో భారత్ 319/3 భారీ స్కోరు చేసింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన రాహుల్ ద్రవిడ్ రికార్డును కోహ్లీ అధిగమించే ఛాన్స్ వుంది.

56
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్

4. రోహిత్ శర్మ 

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ల లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఉన్నారు. హిట్ మ్యాన్ మూడు మ్యాచ్‌ల్లో 36.33 సగటుతో ఒక హాఫ్ సెంచరీతో 109 పరుగులు చేశాడు. 2017లో రోహిత్ 91 పరుగుల ఇన్నింగ్స్ తో  భారత్ 50 ఓవర్లలో 319/3 పరుగులు చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రోహిత్ శర్మ బ్యాట్ పనిచేస్తే రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ వుంది. 

66
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్

5. హార్దిక్ పాండ్యా

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లలో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఉన్నారు. 2017లో తన టోర్నమెంట్ అరంగేట్రంతో పాటు మొత్తంగా పాక్ పై  రెండు మ్యాచ్‌ల్లో 96 సగటుతో రెండు అర్ధ సెంచరీలతో సహా 96 పరుగులు చేశాడు. 2017 ఫైనల్‌లో భారత్ 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 43 బంతుల్లో 76 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, హార్దిక్ ప్రయత్నం ఫలించలేదు, ఎందుకంటే భారత జట్టు 158 పరుగులకే  ఆలౌట్ అయి 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

Read more Photos on
click me!

Recommended Stories