ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. ఈ 6 ప్లేయర్ల ఆటను చూడాల్సిందే!

Published : Feb 22, 2025, 10:21 AM ISTUpdated : Feb 22, 2025, 12:08 PM IST

India vs Pakistan: భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటేనే హై టెన్షన్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాక్ పై విరాట్ విధ్వంసం కనిపిస్తుందా?  షాహీన్ ఆఫ్రిది చెమటలు పట్టిస్తాడా? షమీ, బాబార్ ఆజం మధ్య మరోసారి బిగ్ ఫైట్ ఎలా ఉండనుంది? భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ లో తప్పక చూడాల్సిన ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం!

PREV
17
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ vs పాకిస్తాన్.. ఈ 6 ప్లేయర్ల ఆటను చూడాల్సిందే!

క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికైంది. ఈ హై వోల్టేజీ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో చివరిసారిగా ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఇండియా పాకిస్తాన్‌ను ఓడించింది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లు తలపడనుండటంతో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ మ్యాచ్‌లో చూడాల్సిన టాప్-6 ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

27

1. విరాట్ కోహ్లీ

భారత్, పాక్ మ్యాచ్ అంటేనే విరాట్ కోహ్లీ పేరు వినిపిస్తుంది. పాకిస్తాన్‌పై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. వన్డేల్లో పాకిస్తాన్‌పై 16 మ్యాచ్‌ల్లో 678 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 52.15గా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 22 రన్స్ చేసి అవుటయ్యాడు. పాక్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఫామ్ అందుకుంటాడని భావిస్తున్నారు.

37

2. బాబర్ ఆజమ్

బాబర్ ఆజమ్ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 90 బంతుల్లో 64 రన్స్ చేశాడు. అయితే అతని స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి. పాకిస్తాన్ ఇండియాను ఢీ కొట్టనుండటంతో బాబర్ ఆజమ్ టాప్ ఆర్డర్‌లో రాణించాలని భావిస్తున్నారు. ఇండియాపై బాబర్ ఆజమ్ 8 మ్యాచ్‌ల్లో 31.14 యావరేజ్‌తో 218 రన్స్ చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. న్యూజిలాండ్‌తో ఓడిపోయిన పాకిస్తాన్ కు ఇండియాతో జరిగే మ్యాచ్ డూ ఆర్ డై లాంటింది. 

47

3. రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా టీమిండియాకు ఒక తురుపు ముక్కలాంటి వాడు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఇలా అన్నింట్లోనూ అదరగొడతాడు. పాకిస్తాన్‌పై జడేజా 12 మ్యాచ్‌ల్లో 21.66 యావరేజ్‌తో 130 రన్స్ చేశాడు. అలాగే 12 వికెట్లు తీశాడు. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో జడేజా పాక్ మిడిల్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టగలడు.

57

4. షాహీన్ ఆఫ్రిది

పాకిస్తాన్ పేస్ బౌలర్ షాహీన్ ఆఫ్రిది.. ఇండియా బ్యాటింగ్ లైనప్‌కు ముప్పుతిప్పలు పెట్టగలడు. ఆఫ్రిది బంతితో చాలా ప్రమాదకరమైన బౌలర్. గతంలో కూడా ఇండియన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇండియా బ్యాటర్లు ఆఫ్రిది బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఒక ప్లాన్‌తో రావాలి.

67

5. మహ్మద్ షమీ

ఐసీసీ టోర్నమెంట్ అంటే చాలు పూనకాలే అన్నట్టు రెచ్చిపోతాడు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో షమీ కీలకం కానున్నాడు. కొత్త బంతితో షమీ స్వింగ్ రాబట్టగలడు. బుమ్రా లేని లోటును షమీ తీర్చగలడు. పాకిస్తాన్ ను ఇబ్బంది పెట్టాలంటే షమీ విశ్వరూపం చూపించాల్సిందే. 

77

6. మహ్మద్ రిజ్వాన్

ఇండియా, పాక్ మ్యాచ్‌లో చూడాల్సిన మరో ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిజ్వాన్ 3 రన్స్ మాత్రమే చేశాడు. కానీ రిజ్వాన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఇండియాపై రిజ్వాన్ 3 మ్యాచ్‌ల్లో 25.50 యావరేజ్‌తో 51 రన్స్ చేశాడు. రిజ్వాన్ క్రీజులో కుదురుకుంటే ఇండియన్ బౌలర్లకు కష్టాలు తప్పవు. కాబట్టి భారత జట్టు ఈ ప్లేయర్ ను వీలైనంత త్వరగా పెవిలియన్ కు పంపాలి. 

Read more Photos on
click me!

Recommended Stories