దుబాయ్ పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి వరుణ్ చక్రవర్తి ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అతని బంతికి స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ ఆడటం సులభం కాదు కాబట్టి పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టడానికి వరుణ్ సరైన ఎంపిక అవుతాడు. వరుణ్ కాకుండా భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ రాణా కొంతవరకు బాగా బౌలింగ్ చేశాడు కాబట్టి అతని స్థానానికి ప్రమాదం లేదు.
తొలి మ్యాచ్‌లో మాదిరిగానే భారత జట్టు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. బ్యాటింగ్ లైనప్ విషయానికొస్తే కేఎల్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్ తర్వాత బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉంది. కానీ ఇది మ్యాచ్ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.
పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత తుది జట్టు లో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్. షమీ, హర్షిత్ రాణాలకు చోటుదక్కే ఛాన్స్ ఉంది.