IND vs PAK Asia Cup 2025 Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన యార్కర్‌తో హారిస్ రౌఫ్ ను క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ తర్వాత రాఫేల్ ప్లేన్ సెలబ్రేషన్‌తో పాక్ కు గట్టిగానే తిరిగి ఇచ్చిపడేశాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ బౌలర్లు పాకిస్తాన్‌ను పెద్దగా పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఆరంభంలో వికెట్ల కోసం కష్టపడిన 10 ఓవర్ల తర్వాత అద్భుతమైన కమ్ బ్యాక్ తో పాక్ ను దెబ్బకొట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నారు. పాకిస్తాన్ జట్టు 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది.
26
బుమ్రా యార్కర్‌తో హారిస్ ఔట్.. రాఫేల్ ప్లేన్ సెలబ్రేషన్ తో పాక్ ఇచ్చిపడేశాడు
మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్. 18వ ఓవర్‌లో బుమ్రా వేసిన కచ్చితమైన యార్కర్‌ను హారిస్ రౌఫ్ ఆడలేకపోయారు. బంతి స్టంప్స్‌ను తాకింది. బుమ్రా దెబ్బకు వికెట్ ఎగిరిపడింది. వికెట్ తర్వాత బుమ్రా చేసిన ప్లేన్ క్రాష్ సెలబ్రేషన్‌తో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. గత మ్యాచ్ లో హారిస్ రౌఫ్ వివాదాస్పద తీరుకు దిమ్మదిరిగేలా బుమ్రా ఇచ్చిపడేశాడు.
36
IND vs PAK : హారిస్ రౌఫ్ ప్లేన్ కూలినట్టుగా వివాదాస్పద హావభావాలు
ఈ టోర్నమెంట్‌లోని సూపర్-4 మ్యాచ్‌లో హారిస్ రౌఫ్, భారత అభిమానులను రెచ్చగొట్టేలా ప్లేన్ క్రాష్ హావభావాలు చేశారు. ఆ సమయంలో ఆయన చర్య పెద్ద చర్చనీయాంశంగా మారింది. కానీ ఫైనల్‌లో అదే స్టైల్‌లో బుమ్రా బదులిచ్చారు. ఈ సంఘటనకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఈ ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
IND vs PAK : భారత్ బౌలింగ్ దెబ్బకు పాకిస్తాన్ బ్యాటింగ్ కుప్పకూలింది
పాకిస్తాన్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్ 84 పరుగుల వద్ద కోల్పోయింది. ఓ దశలో 12.4 ఓవర్లకు ఒక వికెట్‌తో 113 పరుగుల వరకు చేరింది. కానీ మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు విరుచుకుపడ్డారు. మొత్తం జట్టు చివరి 9 వికెట్లను కేవలం 33 పరుగులకే కోల్పోయింది.
ఇద్దరి బ్యాటింగ్ మినహా మిగతా ఆటగాళ్లు రాణించలేకపోయారు.
56
ND vs PAK Asia Cup 2025 Final: భారత బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంది?
భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆరంభంలో ఇబ్బందిపడినా తర్వాత అద్భుతమైన బౌలింగ్ తో 20 ఓవర్లు ముగియకముందే పాక్ ను కుప్పకూల్చారు.
• కుల్దీప్ యాదవ్ – 4 వికెట్లు
• జస్ప్రీత్ బుమ్రా – 2 వికెట్లు
• అక్షర్ పటేల్ – 2 వికెట్లు
• వరుణ్ చక్రవర్తి – 2 వికెట్లు
కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు.
66
IND vs PAK: బుమ్రా రాఫేల్ సెలబ్రేషన్ వైరల్.. ఫ్యాన్స్ రియాక్షన్
హారిస్ రౌఫ్ వికెట్ తర్వాత బుమ్రా చేసిన సెలబ్రేషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. భారత అభిమానులు పాక్ కు సరైన సమాధానంగా పేర్కొంటున్నారు. జట్టు ప్రదర్శనతో పాటు బుమ్రా అగ్రెషన్ అభిమానులను ఆకట్టుకుంది.
మొత్తం గా ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. హారిస్ రౌఫ్‌పై బుమ్రా చేసిన ప్లేన్ సెలబ్రేషన్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. పాకిస్తాన్ 20 ఓవర్లకు ముందే ఆలౌటైంది.