ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ క్యాచ్.. గ్లెన్ ఫిలిప్స్
విరాట్ కోహ్లీ తన 300వ వన్డే మ్యాచ్ మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆశించిన క్రికెట్ లవర్స్ కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ లో దూకుడుగా కనిపించిన విరాట్ కోహ్లీ 11 పరుగుల వద్ద బిగ్ షాట్ ఆడబోయి క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.
ఇన్నింగ్స్ 7వ ఓవర్ లో మ్యాట్ హెన్రీ 4వ బంతిని ఆఫ్ స్టంప్ కు వైడ్ గా ఉన్న లెంగ్త్ బాల్ వేశాడు. దానిని కింగ్ కోహ్లీ వికెట్ కు స్క్వేర్ గా బిగ్ షాట్ కొట్టాడు. అయితే, న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ కుడి వైపుకు గాల్లోకి డైవ్ చేసి సంచలనాత్మక క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా విరాట్ కోహ్లీ 11(14) ఎలా పట్టావురా క్యాచ్ అనేలా చూశాడు. అలాగే, మ్యాచ్ చూడ్డానికి వచ్చిన అనుష్క శర్మ కూడా బాప్ రే అనే విధంగా ఒక్కసారిగా షాక్ అయింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీని ఔట్ చేసిన గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన క్యాచ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గ్లెన్ ఫిలిప్స్ సూపర్ షాక్.. అనుష్క శర్మ షాక్