IND vs ENG: ఇంగ్లాండ్ vs భారత్ టెస్టు సిరీస్ 2025లో ఇప్పటివరకు 20 సెంచరీలు నమోదయ్యాయి. మరో రెండు సెంచరీలు వస్తే టెస్టు చరిత్రలో కొత్త ప్రపంచ రికార్డు అవుతుంది.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ టెస్టు చరిత్రలో కొత్త అధ్యాయం రాయబోతున్నట్లు కనిపిస్తోంది. సూపర్ బ్యాటింగ్ తో ప్లేయర్లు సెంచరీల మోత మోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిపి 20 సెంచరీలు సాధించారు. ఇది ఇప్పటికే అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపును సాధించింది. ఇంకా ఐదవ టెస్టు మ్యాచ్ పూర్తికాకపోవడం వల్ల రికార్డు స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి.
DID YOU KNOW ?
ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు సెంచరీలు కొట్టిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్
ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన భారత ప్లేయర్ సచిన్ టెండూల్కర్. ఇంగ్లాండ్ పై సచిన్ 7 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు బాదాడు. అత్యధిక స్కోర్ 193.
25
ఐదు టెస్టుల్లో 20 సెంచరీలు.. టెస్టులో మరో రికార్డు
భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025లో ఇప్పటి వరకు మొత్తం 20 సెంచరీలు నమోదయ్యాయి. దీంతో ఇది క్రికెట్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన టెస్టు సిరీస్‌లలో ఒకటిగా మారింది. ప్రస్తుతం ఐదవ టెస్టు మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోంది. భారత్ ఇచ్చిన 374 పరుగుల లక్ష్యాన్ని అందుకేనే ప్రయత్నంలో ఇంగ్లాండ్ ఉంది. ఇరు జట్ల ప్లేయర్లు 20 సెంచరీలు నమోదుచేశారు.
35
ప్రపంచ రికార్డుకు సమీపంలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ 2025
ప్రస్తుత రికార్డు ప్రకారం.. ఒకే టెస్టు సిరీస్‌లో వచ్చిన అత్యధిక సెంచరీల సంఖ్య 21. ఇది 1955లో ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ సిరీస్‌లో నమోదైంది. ఇరు జట్ల ప్లేయర్లు బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు.
ఆ తర్వాత 2003-04లో వెస్టిండీస్ vs దక్షిణాఫ్రికా సిరీస్‌లో 20 సెంచరీలు నమోదయ్యాయి. ఇప్పుడు ఇంగ్లాండ్-భారత్ టెస్టు సిరీస్ లో 20 సెంచరీలు నమోదయ్యాయి. అయితే, మరో సెంచరీ నమోదు అయితే భారత్-ఇంగ్లాండ్ సిరీస్ కొత్త చరిత్ర రాస్తుంది.
45
భారత్-ఇంగ్లాండ్ సిరీస్ లో ఎవరు ఎన్నెన్ని సెంచరీలు కొట్టారు?
ఈ సిరీస్‌లో భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో ఇరు జట్ల ప్లేయర్లు అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారించారు. ఇప్పటివరకు ఈ సిరీస్ లో సెంచరీలు సాధించిన ప్లేయర్ల వివరాలు గమనిస్తే..
శుభ్‌మన్ గిల్ – 4 సెంచరీలు
కేఎల్ రాహుల్ – 2 సెంచరీలు
రిషబ్ పంత్ – 2 సెంచరీలు
యశస్వి జైస్వాల్ – 2 సెంచరీలు
జో రూట్ – 2 సెంచరీలు
హ్యారీ బ్రూక్ - 2 సెంచరీలు
వీరితో పాటు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బెన్ స్టోక్స్, జెమీ స్మిత్, బెన్ డకెట్, ఓలీ పోప్ లు ఒక్కో సెంచరీ సాధించారు.
55
భారత్ vs ఇంగ్లాండ్: ఐదో టెస్టులో గెలిచేది ఎవరు?
లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదవ టెస్టు అత్యంత కీలకమైనదిగా మారింది. సిరీస్ 2-2తో సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. భారత్ 374 పరుగుల లక్ష్యం ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 272/3 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు తీసుకోవాల్సి ఉంది. ఇంగ్లాండ్ గెలవాలంటే ఇంకా 102 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నుంచి ఇంకో రెండు సెంచరీలు వస్తే IND vs ENG 2025 సిరీస్ టెస్టు చరిత్రలో నిలవనుంది. ఒకే సిరీస్‌లో అత్యధిక సెంచరీల రికార్డును బద్దులు కొడుతుంది. ఇది కేవలం ఆటగాళ్ల ప్రతిభను మాత్రమే కాకుండా, టెస్టు ఫార్మాట్ ప్రాధాన్యతను నొక్కి చెబుతుంది.