ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఆటతీరు భారత్‌ను విజయతీరాలకు నడిపించింది. గ్వాలియర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పాండ్యా ఆకట్టుకునే ప్రదర్శన కీలకంగా మారింది. అతని వేగవంతమైన 39* పరుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. 243.75 స్ట్రైక్-రేట్ తో బ్యాటింగ్ ను కొసాగించాడు.
ఈ మ్యాచ్ ను సిక్సర్ తో ముగించాడు. మరీ ముఖ్యంగా స్టంప్‌ల వెనుక నుంచి పాండ్యా నో-లుక్ ర్యాంప్ షాట్ అదరిపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆటలో ఇలాంటి నైపుణ్యం, విశ్వాసం అతని ప్రదర్శనతో ఆల్ రౌండర్‌గా హార్దిక్ ఖ్యాతిని మరింత పెంచింది.
భారత క్రికెట్ లో టీ20 వికెట్లు తీసిన టాప్ ఆటగాళ్ల జాబితాలో పాండ్యా కూడా చోటు దక్కించుకున్నాడు. తన బ్యాటింగ్ నైపుణ్యంతో పాటు, పాండ్యా తన బౌలింగ్ కెరీర్‌లో కూడా పురోగతి సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను ఒక వికెట్ తో పాటు, 39 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్ ఆడాడు. భారతదేశం తరపున T20Iలలో మొత్తం 87 వికెట్లు సాధించాడు.