ఇంగ్లాండ్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో పాల్ కాలింగ్‌వుడ్ ఒకరు. కెప్టెన్‌గా జట్టును బాగా నడిపించాడు. అతను ఇంగ్లండ్ తరఫున మూడు క్రికెట్ ఫార్మాట్ లలో ఆడాడు. ఐపీఎల్‌లోనూ ఆడాడు. అతని నాయకత్వంలో ఇంగ్లండ్ 2010 టీ20 ప్రపంచకప్ గెలిచింది. తన టెస్టు క్రికెట్ కెరీర్‌లో కాలింగ్ వుడ్ ఎప్పుడూ రనౌట్ కాలేదు.
పాల్ కాలింగ్ వుడ్ టెస్టు క్రికెట్ లో 4259 పరుగులు చేశాడు.టెస్టుల్లో 10 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 206 పరుగులు. అలాగే, వన్డే క్రికెట్ లో 5092 పరుగులు చేయగా, ఇందులో 5 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 క్రికెట్ లో 583 పరుగులు సాధించాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.