ఈ సుడిగాలి ఇన్నింగ్స్ తో దేవదత్ పడిక్కల్ ఫస్ట్ క్లాస్ లో 1,500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 26 మ్యాచుల్లో 36 కంటే ఎక్కువ సగటుతో 1,673 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో పడిక్కల్ మూడు సెంచరీలతో పాటు 11 అర్ధసెంచరీలు సాధించాడు. 2018లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన అతను క్రమంగా టాప్ ఆర్డర్ లో కర్ణాటకకు ప్రధాన ఆటగాడిగా మారాడు. 2021లో శ్రీలంకతో జరిగిన రెండు టీ20ల్లో పడిక్కల్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు.