IND v AFG: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలిమ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరం.. ఎందుకంటే..?

First Published | Jan 11, 2024, 1:09 PM IST

India Afghanistan T20: భార‌త్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూర‌మ‌య్యాడు. టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ విరాట్ తొలి మ్యాచ్ కు అందుబాటులో లేక‌పోవ‌డంపై క్లారిటీ ఇచ్చాడు. 
 

Virat Kohli: మొహాలీ వేదికగా అఫ్గానిస్థాన్ తో టీమిండియా శుక్రవారం తొలి టీ20 మ్యాచ్ ఆడ‌నుంది. అయితే, ఈ మ్యాచ్ కు భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ దూరమ‌య్యాడు. తొలి మ్యాచ్ ను ఆడ‌టం లేదు. అయితే, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డం గురించి టీమిండియా ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ అందుబాటులో ఉండడనీ, ఇండోర్, బెంగళూరులో జరిగే రెండు, మూడో మ్యాచ్ లకు తిరిగి వస్తాడని ద్రవిడ్ ధృవీకరించారు.

కాగా, 2022 నవంబర్ లో ఇంగ్లాండ్ చేతిలో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు టీ20 జ‌ట్టులో లేరు. దాదాపు 14 నెల‌ల త‌ర్వాత టీమిండియా టీ20 జ‌ట్టులోకి వ‌చ్చాడు. భార‌త్-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ లో ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు ఎంట్రీ ఇస్తున్నారు. అఫ్గానిస్థాన్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ లో రోహిత్ శ‌ర్మ కెప్టెన్ గా టీమ్ ను న‌డిపించ‌నున్నాడు. భారత్ 2023లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ క‌ప్ ల కోసం రెండు సుదీర్ఘ ఫార్మాట్లపై దృష్టి పెట్టేందుకు ఈ కాలంలో ఇద్దరు ఆటగాళ్లు టీ20 ఫార్మాట్ నుంచి విరామం తీసుకున్నారు.

Latest Videos


Virat Kohli, RohitSharma

గత రెండు, మూడేళ్లుగా కొన్ని ఐసీసీ ఈవెంట్లు జరిగాయనీ, వాటిలో చాలా వరకు బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయ‌ని ద్రవిడ్ తెలిపాడు. కాబట్టి ఈ ఐసీసీ ఈవెంట్ల మధ్య ఎక్కువ సమయం లేదు. నేను ఇక్కడకు వచ్చిన గత కొన్నేళ్లుగా కొన్ని ఫార్మాట్లకు, కొన్ని టోర్నమెంట్లకు ప్రాధాన్యమివ్వాల్సి వచ్చింది, కేవలం క్రికెట్ ఆడే పరిమాణం, కేవలం ఆటగాళ్లను మేనేజ్ చేయడం వల్ల ఆటగాళ్లందరూ అన్నివేళలా ఆడటం అసాధ్యమ‌ని తెలిపాడు.

rohit virat

ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో ఆడే కుర్రాళ్లకు ఏది ముఖ్యమో వాటికి ప్రాధాన్యమివ్వాల్సి వస్తోంది. ఈ సిరీస్లో కూడా జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ తో జరిగే ఐదు టెస్టులను దృష్టిలో ఉంచుకుని జట్టుకు దూరమయ్యారని తెలిపాడు.

Rohit Sharma-Rahul Dravid

''గత ఏడాది ఎక్కువ భాగం, గత టీ20 ప్రపంచకప్ తర్వాత వన్డే వరల్డ్ క‌ప్ కు ప్రాధాన్యమిచ్చాం. టీ20 ఫార్మాట్ పరంగా వన్డే ప్రపంచకప్ తర్వాత మాకు పెద్దగా మ్యాచ్లు లేవు'' అని ద్రవిడ్ పేర్కొన్నాడు. కాబట్టి ఈ టీ20 వరల్డ్ క‌ప్ ఆ దృక్పథానికి కాస్త భిన్నంగా ఉంటుంది.. దానికి సన్నద్ధం కావడానికి ఎక్కువ సమయం లేదు. కాబట్టి మనకున్న క్రికెట్ పైనే ఆధారపడాలి. అలాగే ఐపీఎల్ పై కూడా కాస్త దృష్టి సారించింది. కానీ కుర్రాళ్లు టీ20 క్రికెట్ ఆడతారు. కాబట్టి వారు ఇక్కడే ఆడతారు, వారు ఐపీఎల్ ఆడతారు. మేము కలిసి ఆడటానికి ఎక్కువ అవకాశాలు లభించకపోవచ్చు కాబ‌ట్టి దానికి అనుగుణంగా టీమిండియా ప్లాన్స్ చేస్తోంద‌ని" ద్ర‌విడ్ పేర్కొన్నారు.

click me!