IND v AFG: ప్రపంచ రికార్డుతో పాటు ధోనీ రికార్డు బద్దలు కొట్టనున్న రోహిత్ శర్మ..

First Published | Jan 10, 2024, 2:09 PM IST

Rohit Sharma: ఆఫ్ఘనిస్తాన్ తో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్ తో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు సృష్టించ‌నున్నాడు. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్ గా 51 మ్యాచ్ ల‌లో 39 విజయాలు సాధించాడు. ఈ సిరీస్ లో భారత  జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేరిస్తే ఎంఎస్ ధోని రికార్డును బ‌ద్ద‌లు కొడ‌తాడు.
 

MS Dhoni, Rohit Sharma

India vs Afghanistan T20 Series: అఫ్గాఆఫ్ఘనిస్తాన్  తో గురువారం జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత జట్టుకు కెప్టెన్ గా తిరిగి వచ్చిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశ‌ముంది. టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా రోహిత్ రికార్డు సృష్టించే అవ‌కాశ‌ముంది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత రోహిత్ భారత జట్టులోకి రావడం ఇదే తొలిసారి. హార్దిక్ పాండ్యా లేదా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ కప్ ఓటమి తర్వాత అన్ని సిరీస్ లలో భారత్ కు నాయకత్వం వహించారు.

MS Dhoni, Rohit Sharma

అయితే, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు భార‌త టీమ్ కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న రోహిత్ శ‌ర్మ అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా ఎంఎస్ ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్ గా 51 మ్యాచ్ ల‌లో 39 విజయాలు సాధించాడు. 72 మ్యాచ్ ల‌లో భారత్ కు 42 విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీ విజ‌య‌వంత‌మైన భార‌త కెప్టెన్ గా ఉన్నాడు. అయితే, ఆఫ్ఘనిస్తాన్  తో మూడు మ్యాచ్ ల‌ సిరీస్ ను 3-0తో భార‌త్ క్లీన్ స్వీప్ చేస్తే.. ధోని రికార్డును బ్రేక్ చేస్తాడు. ధోని రికార్డు మాత్ర‌మే కాదు ప్ర‌పంచ క్రికెట్ లో స‌రికొత్త రికార్డు కానుంది.


MS Dhoni, Rohit Sharma

బాబర్ అజామ్ పేరిట 42 విజయాలు ఉన్నప్పటికీ వన్డే ప్రపంచకప్ తర్వాత పాక్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 42 విజయాలు సాధించిన ఇంగ్లాండ్ మాజీ ఆల్ రౌండర్ ఇయాన్ మోర్గాన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఉగాండా కెప్టెన్ బ్రియాన్ మసాబా కూడా టీ20 క్రికెట్లో 42 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 40 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తర్వాతి స్థానంలో రోహిత్ ఉన్నాడు.

MS Dhoni, Rohit Sharma

ఆఫ్ఘనిస్తాన్  సిరీస్ అనంతరం ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ లో కూడా భార‌త్ పాలుపంచుకోనుంది. ఈ మెగా టోర్నీలో పంచకప్ లో రోహిత్ భార‌త జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్  పై విజయం సాధించకపోతే జూన్ లో జరిగే ప్రపంచకప్ లో రోహిత్ శ‌ర్మ‌ ఆ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

MS Dhoni, Rohit Sharma

భారత కెప్టెన్ల‌లో టీ20ల్లో అత్యధిక విజయాల శాతాన్ని రోహిత్ కలిగి ఉన్నాడు. రోహిత్ విజ‌యాల శాతం 76.74గా ఉంది. 50 టీ20ల్లో భారత్ కు సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ 30 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

Team India

అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్ మ‌న్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకు సింగ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్.

Latest Videos

click me!