ICC Womens World Cup 2025 : ఉమెన్స్ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ వందల కోట్లా..! ఎంతో తెలుసా?

Published : Sep 30, 2025, 11:37 AM IST

ICC Womens World Cup 2025 : ఈసారి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ 2025 కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. కొన్ని మ్యాచులు మాత్రం శ్రీలంకలో జరగనున్నాయి. ఈ వరల్డ్ కప్ ప్రైజ్ మనీ వంద కోట్లకు పైనే ఉంటుంది. ఎంతో తెలుసా? 

PREV
16
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 కి భారత్ ఆతిథ్యం...

ICC Womens World Cup 2025 , IND vs SL : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 13వ ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ మంగళవారం ప్రారంభంకానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇస్తుండగా, ఈ రెండు జట్లే ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. టీమిండియాకు హర్మన్‌ప్రీత్ కౌర్, శ్రీలంకకు చామరి అటపట్టు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. మొదటి మ్యాచ్ ను ఇరు ఆతిథ్య జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి... విజయంతో ఈ వరల్డ్ కప్ ను ప్రారంభించాలని చూస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

26
ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 లో పాల్గొనే జట్లివే

ఇవాళ ప్రారంభమయ్యే మెగా టోర్నీ నవంబర్ 2 వరకు కొనసాగుతుంది… ఇందులో మొత్తం 8 అంతర్జాతీయ మహిళల జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు ట్రోఫీ కోసం పోటీపడతాయి. టోర్నీలో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. భారతదేశంలోని ముంబై, గౌహతి, విశాఖపట్నం, ఇండోర్‌తో పాటు శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్‌లు జరగనున్నాయి. 28 రౌండ్ రాబిన్ మ్యాచ్‌లలో 11 శ్రీలంకలో జరుగుతాయి. సెమీఫైనల్ మ్యాచ్‌లు ముంబై, గౌహతిలో... ఒకవేళ పాకిస్థాన్ పోటీలో ఉంటే కొలంబోలో జరగనున్నారు. ఫైనల్ కు పాకిస్థాన్ చేరకుంటే ముంబైలో, చేరితే కొలంబోలో జరగనుంది.

36
ఈ మెగా టోర్నీ ఫార్మాట్ ఎలా ఉంటుంది

ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ మెగా టోర్నీ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగుతుంది. అంటే జట్లను గ్రూపులుగా విభజించకుండా 8 జట్లను ఒకే గ్రూపులో ఉంచారు. ఈ దశలో ప్రతి జట్టు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడుతుంది. టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో టాప్ లో నిలిచిన రెండు జట్లు ఫైనల్ కి చేరతాయి. ఫైనల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. 

46
భారత ఉమెన్స్ టీం వరల్డ్ కప్ కల నెరవేరుతుందా?

1973 నుంచి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతోంది. భారత్ 1978 నుంచి ప్రపంచకప్‌లో ఆడుతోంది. కానీ ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేదు. రెండుసార్లు (2005, 2017) రన్నరప్‌గా నిలవడమే ఇప్పటివరకు టీమిండియా ఉమెన్స్ క్రికెట్ లో అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈసారి స్వదేశంలో ప్రపంచకప్ జరుగుతుండటంతో భారత్ తన 47 ఏళ్ల వరల్డ్ కప్ ట్రోఫీ కలను నెరవేర్చుకోవాలని చూస్తోంది.

56
ప్రైజ్ మనీ వందకోట్ల పైనే...

ఈసారి మహిళల ప్రపంచకప్‌లో గెలిచిన జట్టుకు సుమారు రూ.39.55 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.122.5 కోట్లు. ఇది 2022 ప్రపంచకప్‌తో పోలిస్తే 297 శాతం ఎక్కువ. గతంలో మొత్తం నగదు బహుమతి కేవలం రూ.31 కోట్లు మాత్రమే. విజేత ఆస్ట్రేలియాకు రూ.11.65 కోట్లు, రన్నరప్ ఇంగ్లాండ్‌కు రూ.5.30 కోట్లు అందాయి. కానీ ఈసారి విజేతకు భారీ నగదు బహుమతి అందనుంది.

66
భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్

సెప్టెంబర్ 30 - భారత్-శ్రీలంక, గౌహతి

అక్టోబర్ 05 - భారత్-పాకిస్థాన్, కొలంబో

అక్టోబర్ 09 - భారత్-దక్షిణాఫ్రికా, విశాఖపట్నం

అక్టోబర్ 12 - భారత్-ఆస్ట్రేలియా, విశాఖపట్నం

అక్టోబర్ 19 - భారత్-ఇంగ్లండ్, ఇండోర్

అక్టోబర్ 23 - భారత్-న్యూజిలాండ్, ముంబై

అక్టోబర్ 26 - భారత్-బంగ్లాదేశ్, ముంబై

Read more Photos on
click me!

Recommended Stories