విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2016 సీజన్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. ఆ తర్వాత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్‌కి కూడా చేరలేకపోయింది...
29
ఐపీఎల్ 20200తో పాటు ఐపీఎల్ 2021 సీజన్‌లో మూడో ప్లేస్‌లో ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్‌సీబీ, ఎలిమినేటర్ మ్యాచుల్లో ఓడి... వరుసగా రెండు సీజన్లలోనూ నాలుగో ప్లేస్‌లో ముగించింది...
39
ఐపీఎల్ 2022 సీజన్ కోసం విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ, మిగిలిన ప్లేయర్లను వేలానికి వదిలి వేసింది...
49
కొత్త కెప్టెన్ కోసం ఎదురుచూస్తున్న ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ల కోసం చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది...
59
‘విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోతే, ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ సంతోషంగా అతనికే కెప్టెన్సీ ఇచ్చేస్తే మంచిది...
69
విరాట్ కోహ్లీ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త కెప్టెన్‌ను ఎంచుకుని, ప్రయోగాలు చేసేబదులు, విరాట్‌కే మళ్లీ కెప్టెన్సీ ఇవ్వడం చాలా బెటర్...
79
గత సీజన్లలో టైటిల్ సాధించడానికి అవసరమైన 14 మంది ప్లేయర్లను తయారుచేయడంలో ఆర్‌సీబీ విఫలమైంది. భారీగా డబ్బులు చెల్లించి, ప్లేయర్లను కొనుగోలు చేసినా... జట్టు కూర్పును పట్టించుకోలేదు...
89
ఆర్‌సీబీ ఎప్పుడూ టాప్ 3 ప్లేయర్లపైనే ఆధారపడింది. మిడిల్ ఆర్డర్‌లో సరైన ప్లేయర్లు లేరు. డబ్బులు లేకపోతే, మళ్లీ ఆ తప్పులు చేయడానికి అవకాశం ఉండదు...
99
కాబట్టి ఒక్క ప్లేయర్ల కోసం భారీగా ఖర్చు పెట్టే బదులు, మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లను తయారుచేయడంపై ఫోకస్ పెడితే మంచిది..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్..