ఆ బాధ ఇప్పటికీ ఉంది, కెఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి పంపాడు... విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్...

Published : Feb 07, 2022, 05:10 PM IST

ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటిదాకా 14 సీజన్లపాటు ఒకే జట్లుకి ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా 9 సీజన్లు, జట్టును నడిపించినా ఆర్‌సీబీకి టైటిల్ అందించలేకపోయాడు విరాట్...

PREV
110
ఆ బాధ ఇప్పటికీ ఉంది, కెఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి పంపాడు... విరాట్ కోహ్లీ ఎమోషనల్ కామెంట్స్...

2016 ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ వీరవిహారం చేశాడు. 16 మ్యాచుల్లో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 81.08 సగటుతో 973 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు కోహ్లీ.. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది...

210

విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్, కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్ల బ్యాటింగ్ కారణంగా ఐపీఎల్ 2016 సీజన్‌లో అద్భుత విజయాలతో ఫైనల్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

310

హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లింది. 209 పరుగుల లక్ష్యఛేదనలో ఒకానొకదశలో 10.2 ఓవర్లలో 114/0 పరుగులు చేసిన ఆర్‌సీబీ, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది...

410

క్రిస్ గేల్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 76 పరుగులు, విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేయగా ఫైనల్ మ్యాచ్‌లో ఏబీ డివిల్లియర్స్, కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్ విఫలం కావడం జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది...

510

‘2016 ఫైనల్, అలా జరగాలని రాసుందనుకున్నా. బెంగళూరులో అంత అద్భుతంగా ఆడిన తర్వాత 9 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన తర్వాత ఓడిపోతామని ఎవ్వరు మాత్రం అనుకుంటారు...

610

ఆ మ్యాచ్‌ను ఈ మధ్యే టీవీలో మళ్లీ వేస్తే, కెఎల్ రాహుల్ ఆ స్క్రీన్ షాట్స్ తీసి నాకు పంపాడు. వాటిని చూస్తుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది... ఆ బాధకు అంతం లేదు...

710

ఎప్పుడు దాని గురించి ఆలోచించినా, గెలవలేకపోయామనే బాధ గుండెలను గుచ్చుతూ ఉంటుంది. ఆ రోజు మాది కాదు అనుకోవడమే. ఐపీఎల్‌లో టైటిల్ గెలవకపోవడం నన్ను ఎప్పటికీ కలిచివేస్తూ ఉంటుంది...

810

2016 ఐపీఎల్, కెఎల్ రాహుల్ కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. దీన్ని అతను కూడా ఒప్పుకుంటాడు. ఆ సీజన్‌ మా అందరికీ ఓ అద్భుతం. నలుగురం కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాం...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ...

910

2013 ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత రెండు సీజన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఆడాడు. 

1010

2016 సీజన్‌లో తిరిగి ఆర్‌సీబీలోకి వచ్చిన కెఎల్ రాహుల్, ఆ సీజన్‌లో 14 మ్యాచుల్లో 397 పరుగులు చేసి విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ తర్వాతి స్థానంలో నిలిచాడు. 

Read more Photos on
click me!

Recommended Stories