T20 World cup: రెండు మ్యాచులు ఓడినంత మాత్రాన చెడ్డవాళ్లం అయిపోం కదా.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్

First Published Nov 4, 2021, 3:34 PM IST

Rohit Sharma: రెండు వరుస పరాజయాలు తర్వాత వచ్చిన ఈ గెలుపు టీమిండియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని రోహిత్ శర్మ అన్నాడు. అయితే రెండు వారాలుగా తమపై వస్తున్న విమర్శలపై హిట్ మ్యాన్ ఘాటుగా స్పందించాడు. 

టీ20 ప్రపంచకప్ లో భాగంగా వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన ఇండియా.. నిన్న రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్ లో అఫ్గాన్ ను ఓడించింది.  రెండు వరుస పరాజయాలు తర్వాత వచ్చిన ఈ గెలుపు టీమిండియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే రెండు వారాలుగా తమపై వస్తున్న విమర్శలపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్పందించాడు. 

టీమిండియా పేలవ ప్రదర్శనతో పాటు రోహిత్ శర్మ ఆటతీరుపై వస్తున్న విమర్శలపై హిట్ మ్యాన్ ఘాటుగా  స్పందించాడు. తమదైన రోజున ఆడితే టీమిండియా ఆటతీరు ఎలా ఉంటుందో నిన్నటి మ్యాచ్ తో అందరికీ అర్థమైందని అన్నాడు. 

ఇప్పటికీ మాది గొప్ప జట్టు. పాకిస్థాన్, న్యూజిలాండ్ వంటి జట్లతో ఏదో ఒక జట్లతో ఏదో ఒక రోజున ఓడినంత మాత్రానా తక్కువ చేయకూడదు. మాదైన రోజున చెలరేగి ఆడితే ఎలా ఉంటుందో అందరికీ అర్థమైంది..’అని అన్నాడు. 

‘గత రెండు మ్యాచ్ లలో ఇలా జరుగలేదు. అయినంత మాత్రానా రాత్రి రాత్రే మేము చెత్త ఆటగాళ్లుగా మారలేదు కదా. రెండు మ్యాచులు సరిగా ఆడనంత మాత్రానా ఆటగాళ్లంతా పనికిరారు అని చెప్పలేం’ అని అన్నాడు. 

‘ఈ పరిస్థితులలో మీరు నిర్భయంగా ఉండాలి. మీ చుట్టూ జరుగుతుందో ఆలోచించకూడదు. మాది చాలా మంచి జట్టు. పాకిస్థాన్, న్యూజిలాండ్ తో మ్యాచ్ లో మేము గొప్పగా రాణించలేదు’ అని అన్నాడు. 

గత రెండు మ్యాచులలో పరుగులు చేయడంలో విఫలమైన (0, 14).. రోహిత్ నిన్నటి మ్యాచ్ లో మాత్రం ఇరగదీశాడు. 47 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో తనదైన శైలిలో విజృంభించి భారత విజయానికి  కెఎల్ రాహుల్ తో కలిసి పునాదులు వేశాడు. 

click me!