కింగ్ రా బచ్చా... కెప్టెన్సీ స్కిల్స్‌ లేవన్న వారికి అరుదైన రికార్డుతో నోళ్లు మూయించిన విరాట్ కోహ్లీ...

First Published Nov 4, 2021, 3:30 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు వరుసగా రెండు పరాజయాలను చవిచూసింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిన టీమిండియా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ రెండు ఓటముల కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విరాట్ కోహ్లీ...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి పనికి రాడని, అతను కెప్టెన్‌గా ఉన్నంతకాలం టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేదని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ మాజీ పేసర్ డానిష్ కనేరియా అయితే విరాట్ కోహ్లీలో తానెప్పుడూ కెప్టెన్సీ స్కిల్స్ చూడలేదని కామెంట్ చేశాడు...

విరాట్ కోహ్లీ స్థానంలో ఎమ్మెస్ ధోనీ ఉండి ఉంటే, ఈపాటికి టీమిండియా సెమీస్ చేరిపోయేదని, విరాట్ కోహ్లీకి జట్టును ఎలా నడిపించాలో తెలియడం లేదని తీవ్రంగా ట్రోల్స్ వచ్చాయి...

భారత జట్టుకి అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్‌గా టాప్‌లో నిలిచిన విరాట్ కోహ్లీ, విదేశాల్లో ఇంతకుముందెన్నడూ, ఏ భారత కెప్టెన్ సాధించని రికార్డులను కొల్లగొట్టి చూపించాడు... 

ప్రపంచంలోనే అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న కెప్టెన్లలో నాలుగోవాడిగా ఉన్న విరాట్ కోహ్లీ, వన్డేల్లోనూ మంచి సక్సెస్ రేటు నమోదుచేశాడు. ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో 200 వన్డేలు ఆడి 110 విజయాలు అందుకుంది టీమిండియా...

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇప్పటిదాకా 95 వన్డేలు జరగగా, అందులో 65 మ్యాచుల్లో విజయాలు అందుకుంది టీమిండియా. ఎమ్మెస్ ధోనీ సక్సెస్ రేటు 59.52 కాగా, విరాట్ కోహ్లీ విజయాల శాతం 70.43...

తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయాన్ని నమోదుచేసింది. జట్టు అవసరాలకు తగ్గట్టుగా రెండు వికెట్లు పడిన తర్వాత తాను బ్యాటింగ్‌కి రాకుండా రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యాలను బ్యాటింగ్‌కి పంపాడు విరాట్ కోహ్లీ...

మొదటి ఓవర్‌లో ప్యాడ్స్, హెల్మెట్ పెట్టుకుని బ్యాటింగ్‌కి వెళ్లడానికి సిద్ధమైన విరాట్ కోహ్లీ, టీమిండియా ఇన్నింగ్స్ మొత్తం అలాగే చూశాడు.

టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన కోహ్లీ మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు

ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం విరాట్ కోహ్ల కెరీర్‌లో 30వ టీ20 విజయం. టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో మూడు ఫార్మాట్లలో 30+ అంతకంటే ఎక్కువ విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

టెస్టుల్లో 30కి పైగా విజయాలు అందుకున్న కెప్టెన్లు ఆరుగురు ఉండగా, వన్డేల్లో ఏకంగా 41 మంది కెప్టెన్లు 30+ విజయాలను అందుకున్నారు. టీ20ల్లో నలుగురు 30+ విజయాలు అందుకున్నారు. అయితే మూడు ఫార్మాట్లలో ఈ ఫీట్ సాధించిన ఏకైక, మొట్టమొదటి కెప్టెన్ విరాట్ కోహ్లీయే...

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి, 27 విజయాలు అందుకున్నాడు. వన్డేల్లో, టీ20ల్లో 30+ విజయాలు అందుకున్నా, టెస్టుల్లో ఈ ఫీట్ అందుకోలేకపోయాడు...

కెప్టెన్‌గా 65 టెస్టుల్లో 38 విజయాలు అందుకున్న భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 109 టెస్టుల్లో 53 విజయాలు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 77 టెస్టుల్లో 48 విజయాలు, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా 57 టెస్టుల్లో 41 విజయాల తర్వాతి స్థానంలో నిలిచాడు...

click me!