ICC Rankings: గిల్ ఖాతాలో అదిరిపోయే రికార్డ్.. బుమ్రా నంబర్ 1 కుర్చీ లాగేసుకున్న కీవీస్ ప్లేయర్

Published : Jun 25, 2026, 08:22 AM IST

ICC Rankings: ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ రెండో స్థానానికి దూసుకెళ్లగా, టెస్ట్ బౌలింగ్‌లో బుమ్రాతో కలిసి మ్యాట్ హెన్రీ నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఏం స్థానంలో ఉన్నారు. పూర్తి వివరాలు గమనిస్తే..

PREV
15
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ రచ్చ.. బుమ్రాతో సమానంగా నంబర్ 1 స్థానానికి చేరిన కీవీస్ బౌలర్!

క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) లేటెస్ట్ వీక్లీ ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ గట్టిగానే స్కోర్ చేశారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కెప్టెన్‌గా దుమ్ములేపిన శుభ్‌మన్ గిల్, ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఏకంగా రెండో స్థానానికి దూసుకెళ్లాడు. అంతకుముందు 5వ స్థానంలో ఉన్న గిల్, ఇప్పుడు 3 స్థానాలు ఎగబాకి నంబర్ 2 కుర్చీలో కూర్చున్నాడు.

ప్రస్తుతం గిల్ రేటింగ్ 791గా ఉంది. వన్డేల్లో నంబర్ 1 స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ప్లేయర్ డెరిల్ మిచెల్ (815 రేటింగ్) కంటే గిల్ కేవలం 24 రేటింగ్ పాయింట్లు మాత్రమే వెనుకబడి ఉన్నాడు. అఫ్గాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో గిల్ 238 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

25
ఇషాన్ కిషన్ లాంగ్ జంప్.. రోహిత్, కోహ్లీల స్థానాలు ఏంటంటే?

ఈ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో యంగ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 43వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అఫ్గాన్ సిరీస్‌లో అదరగొట్టిన ఇషాన్ రేటింగ్ ప్రస్తుతం 516గా ఉంది. ఇక టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అఫ్గాన్ సిరీస్‌కు దూరమయ్యాడు. దీని ప్రభావం అతని ర్యాంకింగ్‌పై పడింది. కిందటి వారం రెండో స్థానంలో ఉన్న కోహ్లీ, ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం తన నాలుగో స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నాడు. అఫ్గాన్‌పై జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో రోహిత్ ఒక హాఫ్ సెంచరీతో కలిపి 143 రన్స్ చేశాడు.

35
బౌలింగ్‌లో ముగ్గురు భారతీయుల హవా

వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన ముగ్గురు బౌలర్లు భారీగా లాభపడ్డారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 16 స్థానాలు పైకి ఎగబాకి 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 34 స్థానాలు జంప్ చేసి 58వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా 17 స్థానాలు ఎగబాకి సంయుక్తంగా 71వ స్థానానికి చేరుకున్నాడు. వన్డే బౌలర్ల జాబితాలో అఫ్గానిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్ మొదటి స్థానంలో, పాకిస్థాన్‌కు చెందిన అబ్రార్ అహ్మద్ రెండో స్థానంలో, ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ మూడో స్థానంలో ఉన్నారు.

45
టెస్టుల్లో 36 ఏళ్ల రికార్డ్ బద్దలు కొట్టిన మ్యాట్ హెన్రీ

టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక సెన్సేషనల్ రికార్డ్ నమోదైంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ ఏకంగా 6 స్థానాలు ఎగబాకి టీమిండియా స్టార్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఇద్దరి రేటింగ్స్ 870గా ఉన్నాయి. కివీస్ టీమ్ తరఫున ఒక బౌలర్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్‌కు చేరుకోవడం 36 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అంతకుముందు 1990లో రిచర్డ్ హాడ్లీ న్యూజిలాండ్ తరఫున నంబర్ 1 బౌలర్‌గా ఉన్నారు.

అంతకంటే ముందు 1947లో జాక్ కౌవీ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు మ్యాట్ హెన్రీ ఈ లిస్ట్‌లో మూడో ప్లేయర్‌గా చేరి హిస్టరీ క్రియేట్ చేశాడు. నవంబర్ 2024లో కగిసో రబాడను వెనక్కి నెట్టి బుమ్రా ఒంటరిగా నంబర్ 1 స్థానంలో ఉండగా, ఇప్పుడు హెన్రీ అతనితో ఈ స్థానాన్ని షేర్ చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో హెన్రీ 11 వికెట్లు పడగొట్టి ఈ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

55
టెస్ట్ బ్యాటింగ్‌లో మళ్లీ జో రూట్ దే రాజ్యం

ఇక టెస్ట్ బ్యాటర్ల విషయానికి వస్తే, ఇంగ్లాండ్ స్టాండ్-ఇన్ కెప్టెన్ జో రూట్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. రెండు స్థానాలు పైకి ఎగబాకిన రూట్ రేటింగ్ 871కి చేరింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రూట్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌కే చెందిన హ్యారీ బ్రూక్ 866 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories