IPL 2024: చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే చివ‌రి ఐపీఎల్ అవుతుందా?

First Published | Feb 28, 2024, 3:51 PM IST

MS Dhoni - IPL 2024 : మార్చి 22 నుంచి ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్  ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్ప‌టికే చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్, దిగ్గ‌జ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోని ప్రాక్టిస్ షురూ చేశాడు. ఈ సారి కూడా టైటిల్ పై ధోని టీమ్ క‌న్నేసింది. 
 

MS Dhoni,, CSK

IPL 2024 - MS Dhoni - Suresh Raina:  మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ 2024కు స‌ర్వం సిద్ద‌మైంది. మార్చి 22 నుంచి ఇండియా ప్రీమియ‌ర్ లీగ్ ఈ ఏడాది సీజ‌న్ ప్రారంభం కానుండ‌గా, చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే)-రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌తిసారి ఐపీఎల్ లో మొద‌ట హాట్ టాపిక్ అయ్యే పేరు ఎంఎస్ ధోని.

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కి ఎంఎస్ ధోని నాయకత్వం వహిస్తున్నాడు. గ‌త ఐపీఎల్ మాదిరిగానే ఇప్పుడు కూడా ధోనికి ఇదే చివ‌రి ఐపీఎల్ అవుతుందా? అనే టాక్ న‌డుస్తోంది. 


'തല' രണ്ട്

మిస్టర్ ఐపీఎల్ అని కూడా పిలువబడే టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ సురేష్ రైనా.. ఐపీఎల్ రాబోయే ఎడిషన్ ఎంఎస్ ధోనికి టోర్నమెంట్‌లో చివరిది అవుతుందా? అనే సందేహాల మ‌ధ్య తన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకున్నారు. 2023లో అందరూ ఊహించినట్లుగా ధోని చివ‌రి సీజ‌న్ అనుకున్నారు కానీ, తన మద్దతుదారుల నుండి చాలా ప్రేమను పొందిన తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటించలేనని పేర్కొన్నాడ‌ని తెలిపాడు. 

Chennai Super Kings, MS Dhoni

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సీఈవో కాశీ విశ్వనాథన్, కెప్టెన్ ఎంఎస్ ఐపీఎల్ 2024లో ఆడటానికి ఫిట్‌గా ఉంటాడని విశ్వాసం వ్యక్తం చేశారు, దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ మోకాలి సమస్యల నుండి బాగా కోలుకున్నారనీ, ప్రస్తుతం పునరావాసం మరియు శిక్షణా సెషన్‌లలో ఉన్నారని పేర్కొన్నారు. ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభమయ్యే సమయానికి ధోనీకి 42 సంవత్సరాలు నిండుతాయి. చెన్నైలో టోర్నమెంట్ ఓపెనర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూప‌ర్ కింగ్స్ తో తలపడుతుంది.

ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతూ.. "నాకు దీని గురించి ఎలాంటి ఆలోచన లేదు. కానీ అతను నిజంగా కష్టపడుతున్నాడు. అతను నిజంగా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ఇది అతని ఇష్టం. పసుపు రంగు జెర్సీలో ఉండి అభిమానులను అలరించనున్నాడు. అభిమానులు ఆయనను మాత్రమే ప్రేమిస్తారు. అతను నిజంగా బాగా చేస్తాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ధోని క్రికెట్ కోసం చాలా చేశార‌ని" రైనా పేర్కొన్నాడు. 

ఐపీఎల్ 2024 మార్చి 22న ప్రారంభమవుతుంది. ఇప్ప‌టికే ఐపీఎల్ టోర్నీకి సంబంధించి 14 రోజుల షెడ్యూల్ విడుద‌లైంది. భార‌త స సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మిగ‌తా స‌గం షెడ్యూల్ ను విడుద‌ల చేయ‌నున్నారు. అయితే, ఈ సీజ‌న్ కు కెప్టెన్సీలో గేమ్ ఆడ‌నున్నారు. అయితే, ఈ సీజ‌న్ తో ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు సంబంధిత వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తుంది. ఒక‌వేళ అదే జ‌రిగితే ఈ సారి ఐపీఎల్ టైటిల్ గెలిచి ధోని గ్రాండ్ గా వీడ్కోలు ప‌ల‌కాల‌ని చెన్నై టీమ్ భావిస్తోంది. 

Latest Videos

click me!