ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వ‌చ్చేసింది.. రెండు దేశాల్లో టోర్నీ.. IND-PAK మ్యాచ్ ఎప్పుడంటే?

First Published | Dec 24, 2024, 7:17 PM IST

ICC Champions Trophy 2025: ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ వ‌చ్చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ 19 రోజుల పాటు రెండు దేశాల్లో జరగనుందని ఐసీసీ అధికారిక తేదీలను ప్ర‌క‌టించింది.
 

ICC Champions Trophy 2025:ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ నిరీక్షణకు తెర‌దించింది. రాబోయే ఏడాది జరిగే మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ పై అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సారి ఛాంపియ‌న్స్ ట్రోఫీ రెండు దేశాల్లో జ‌ర‌గ‌నుంది.

భార‌త్ దెబ్బ‌కు రెండు దేశాల్లో మ్యాచ్ లు 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హ‌క్కుల‌ను పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే, అక్క‌డ‌కు వెళ్ల‌డానికి భార‌త్ నో చెప్ప‌డంతో ఇప్పుడు ఐసీసీ ట్రోఫీ మ్యాచ్ ల‌ను రెండు దేశాల్లో నిర్వ‌హించ‌డానికి ఒకే చెప్పింది. దుబాయ్ తో పాటు పాకిస్తాన్ లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ జ‌ర‌గ‌నుంది. భారతదేశం తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. మిగిలిన దేశాలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది.

ICC Champions Trophy 2025

ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ 

ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభమవుతుంది. ఫైన‌ల్ మ్యాచ్ మార్చి 9 జ‌ర‌గ‌నుంది. ఫిబ్రవరి 19 పాకిస్తాన్ vs న్యూజిలాండ్ జ‌ట్లు కరాచీ వేదిక‌గా ట్రోఫీ ప్రారంభ మ్యాచ్ ను ఆడ‌నున్నాయి. భారత జట్టు ఫిబ్రవరి 20 నుండి తన తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే విషయంలో చాలా కాలంగా బీసీసీఐ, పీసీబీ మధ్య టెన్షన్ నెలకొంది. చివ‌ర‌కు బీసీసీఐ దెబ్బ‌కు పీసీబీ వెన‌క్కి త‌గ్గింది. భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది.


ICC Champions Trophy 2025 Schedule

మొత్తం 8 జట్లను రెండు గ్రూపులు.. ఒకే గ్రూప్ లో భారత్-పాక్

ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025  టోర్నీలో తొలి మ్యాచ్ కరాచీలో జరగనుంది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ప్రారంభ మ్యాచ్ ఆడనున్నాయి. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. రెండో గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. టోర్నీ చివరి మ్యాచ్ మార్చి 9న జరగనుంది.

ICC Champions Trophy 2025 : India vs Pakistan

ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

టోర్నీ చివరి మ్యాచ్ అయిన ఫైన‌ల్ లాహోర్‌లో జరుగుతుంది. అయితే భారత్ అర్హత సాధిస్తే  ఫైన‌ల్ దుబాయ్‌లో జరుగుతుంది. సెమీ-ఫైనల్, ఫైనల్స్ రెండింటికీ రిజర్వ్ డేను కేటాయించారు. చివరి మ్యాచ్‌కి మార్చి 10 రిజర్వ్ డేగా ఉంది. పాకిస్థాన్‌లోని రావల్పిండి, లాహోర్, కరాచీ మూడు నగరాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంత‌గానో ఎదురుచూస్తున్న భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య  ఫిబ్రవరి 23న దుబాయ్‌లో గ్రేట్ మ్యాచ్ జరగనుంది. దీని తర్వాత భారత జట్టు మార్చి 2 న న్యూజిలాండ్‌తో గ్రూప్ దశలో మూడవ, చివరి మ్యాచ్ ఆడనుంది. రెండు గ్రూపుల్లోని టాప్-2 జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ICC Champions Trophy 2025 fixtures

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పూర్తి షెడ్యూల్ 

గ్రూప్ A - పాకిస్థాన్, ఇండియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్

గ్రూప్ B - దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్

ఛాంపియన్స్ ట్రోఫీ :

19 ఫిబ్రవరి, పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ, పాకిస్తాన్

20 ఫిబ్రవరి, బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్

21 ఫిబ్రవరి, ఆఫ్ఘనిస్తాన్ vs సౌత్ ఆఫ్రికా, కరాచీ, పాకిస్థాన్

22 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్

23 ఫిబ్రవరి, పాకిస్థాన్ vs ఇండియా, దుబాయ్

24 ఫిబ్రవరి, బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి, పాకిస్థాన్

25 ఫిబ్రవరి, ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, రావల్పిండి, పాకిస్తాన్

26 ఫిబ్రవరి, ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్, పాకిస్తాన్

ఫిబ్రవరి 27, పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి, పాకిస్తాన్

28 ఫిబ్రవరి, ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్, పాకిస్తాన్

1 మార్చి, దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ, పాకిస్తాన్

2 మార్చి, న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్

4 మార్చి, సెమీ-ఫైనల్ 1, దుబాయ్

5 మార్చి, సెమీ-ఫైనల్ 2, లాహోర్, పాకిస్తాన్

మార్చి 9, ఫైనల్, లాహోర్ (భారత్ అర్హత సాధిస్తే దుబాయ్‌లో మ్యాచ్ జరుగుతుంది)

Latest Videos

click me!