అద‌ర‌గొట్టిన అమ్మాయిలు.. స్మృతి మంధాన, రేణుకా సూప‌ర్ షో

First Published | Dec 22, 2024, 9:26 PM IST

India Women vs West Indies Women: వడోదరలోని కోటంబి స్టేడియంలో భారత్ మహిళల క్రికెట్ జ‌ట్టు వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టుకు బిగ్ షాకిచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి 211 పరుగుల భారీ తేడాతో తొలి వన్డేలో విజయం సాధించింది. 
 

India Women, cricket,

India-W vs West Indies-W: భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు విండిస్ పై అద్బుత‌మైన విజ‌యం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో మ‌న అమ్మాయిలు సూప‌ర్ గేమ్ షో చూపించారు. వడోదరలో జరిగిన తొలి మహిళల వ‌న్డేలో భారత్ 211 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

India Women, cricket,

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం చేశారు. భారత వైస్-కెప్టెన్ స్మృతి మంధాన వరుసగా నాలుగో అర్ధ సెంచరీని కొట్టి, అరంగేట్రం ప్లేయ‌ర్ ప్రతికా రావల్ (40)తో కలిసి 110 పరుగుల ఓపెనింగ్-వికెట్ భాగస్వామ్యాన్ని భాగస్వామ్యం చేసింది. వీరి ఇన్నింగ్స్ ల‌లో భార‌త జ‌ట్టు 50 ఓవర్లలో 314/9 స్కోర్ చేసింది.


India Women, cricket,

 భార‌త స్టైలిష్ ఓపెనర్ స్మృతి మంధాన 102 బంతుల్లో 91 పరుగులతో క్లాసిక్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టారు.  దీంతో వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మహిళల వ‌న్డే లో భార‌త్ 9 వికెట్లు కోల్పోయి 314 ప‌రుగులు చేసింది. భార‌త ఇన్నింగ్స్‌లలో ఐదోసారి 50 ప్లస్ స్కోరు నమోదు చేసిన మంధాన, అరంగేట్రం ప్లేయ‌ర్ ప్రతికా రావల్ (69 బంతుల్లో 40)తో కలిసి 110 పరుగుల భాగ‌స్వామ్యం సాధించింది.

India Women, cricket,

మంధాన మిడిల్ ఆర్డర్‌కు బ‌ల‌మైన పునాది వేయ‌గా, ఆ త‌ర్వాత‌ హర్మన్‌ప్రీత్ కౌర్ (23 బంతుల్లో 34), హర్లీన్ డియోల్ (50 బంతుల్లో 44), రిచా ఘోష్ (12 బంతుల్లో 26), జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 31) ఇన్నింగ్స్ ల‌లో టీమిండియా స్కోరు 300 ప‌రుగులు దాటింది. 91 ప‌రుగుల ఇన్నింగ్స్ తో ఆడిన మంధ‌న ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డును బ‌ద్ద‌లు కొట్టింది.

India Women, cricket,

ఇక భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ ప్లేయ‌ర్ల‌ను ప‌రుగులు చేయ‌కుండా అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న చూపించారు భార‌త బౌల‌ర్లు. రేణుకా సింగ్ బౌలింగ్ దెబ్బ‌కు విండీస్ ఏ స‌మ‌యంలోనూ కోలుకోలేక‌పోయింది. పేసర్ రేణుకా సింగ్ (5/29 వికెట్లు) సూప‌ర్ బౌలింగ్ తో  వెస్టిండీస్ 26.2 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భార‌త జ‌ట్టు 211 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యాన్ని అందుకుంది. రేణుకా సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. 

వెస్టిండీస్ ప్లేయర్లలో బౌలర్ జైదా జేమ్స్ 5 వికెట్లు తీసుకున్నారు. కెప్టెన్ హేలీ మాథ్యూస్ 2 వికెట్లు తీసుకున్నారు. అఫీ ఫ్లెచర్ 24* పరుగులతో విండీస్ ప్లేయ‌ర్ల‌లో టాప్ స్కోర‌ర్ గా నిలిచారు. 

Latest Videos

click me!