ఇంగ్లాండ్ కు అతడెలాగో.. టీమిండియాకు నేనూ అలా అవుతా.. వెంకటేష్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Nov 15, 2021, 05:33 PM IST

Venkatesh Iyer: ఇండియాలో నాణ్యమైన బ్యాటర్లకు, మెరుగైన బౌలర్లకు కొదవలేదు.  ఒకరిని మరిపించేలా ఒకరు తయారవుతూనే ఉన్నారు. కానీ సమస్యంతా ఆల్ రౌండర్ల దగ్గరే వస్తున్నది. కానీ తాను ఆ కొరత తీరుస్తానంటున్నాడు  అయ్యర్.

PREV
17
ఇంగ్లాండ్ కు అతడెలాగో.. టీమిండియాకు నేనూ అలా అవుతా.. వెంకటేష్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత క్రికెట్ ను దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్య ఆల్ రౌండర్. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తర్వాత అంతటి నిఖార్సైన ఆల్ రౌండర్ కోసం భారత అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. మధ్యలో కొంతమంది వచ్చినా వాళ్లు ఏదో ఒక విభాగంలో తప్పితే బ్యాటింగ్, బౌలింగ్ లో భారీ స్థాయిలో మెరుపులు మెరిపించిన దాఖలాలు చాలా తక్కువ. 

27

రాబిన్ సింగ్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, రవీంద్ర జడేజా వంటి  క్రికెటర్లు బ్యాట్, బంతితో రాణించినా ఏదో ఒక రంగంలోనే నిష్ణాతులయ్యారే తప్ప రెండింటిలో గొప్పగా రాణించలేకపోయారు.  ఇటీవల  కాలంలో  హార్ధిక్ పాండ్యా మీద ఆశలు పెట్టుకున్నా టీ20 ప్రపంచకప్ తర్వాత అతడి భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. 

37
वेंकटेश अय्यर

ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆల్ రౌండర్ లేని కొరతను తీరుస్తానంటున్నాడు వెంకటేష్ అయ్యర్. ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న  అయ్యర్.. ఇటీవలే ముగిసిన సీజన్ లో అదరగొట్టాడు. ఐపీఎల్ లో మెరుపులు మెరిపించిన  అయ్యర్ కు త్వరలో  ఇండియా-న్యూజిలాండ్  టీ20 సిరీస్ లో ఆడేందుకు కూడా ఎంట్రీ లభించింది.

47

ఇటీవలే ప్రకటించిన టీ20 జట్టులో అతడు సభ్యుడు.  బ్యాటింగ్ తో పాటు మీడియం పేస బౌలర్ అయిన అయ్యర్.. భారత్ కు మూడు ఫార్మాట్లలో సేవలందించడమే తన లక్ష్యమని అంటున్నాడు. ఇంగ్లాండ్  ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను తాను ఆరాధిస్తానని, అతడిలా అన్ని ఫార్మాట్లలో విజయవంతం కావాలన్నదే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు. 

57

అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఇంగ్లాండ్ కు బెన్ స్టోక్స్ ఎలా ఆడతాడో టీమిండియా తరఫున నేను కూడా అలా ఆడాలన్నదే నా లక్ష్యం. స్టోక్సే నాకు ఆదర్శం.  ఫార్మాట్ ఏదైనా అతడు మ్యాచ్ విన్నర్. బంతి, బ్యాట్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లో అతడు మెరుగైన ఆటగాడు.

67

అతడిని చూసినప్పుడల్లా నేను కూడా టీమిండియాకు ఇలా కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటాను. మూడు ఫార్మాట్లలో ఏ పొజిషన్ ఇచ్చినా టీమిండియా తరఫున నా ఉత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నాను’అని తెలిపాడు.

77

ఇటీవలే ముగిసిన ఐపీఎల్-14లో 10 మ్యాచులాడిన వెంకటేష్ అయ్యర్.. 370 పరుగులు చేశాడు. మీడియం పేసర్ అయిన అతడు.. మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఐపీఎల్ రెండో ఫేజ్ లో అతడి ప్రదర్శన తర్వాత అతడు.. టీమిండియా నెట్ బౌలర్ గా ఎంపికయ్యాడు.  హార్ధిక్ పాండ్యా కెరీర్ సందిగ్ధంలో పడ్డ వేళ అయ్యర్ ఆ స్థానాన్ని ఏ మేరకు భర్తీ చేస్తాడో చూడాలి మరి..

Read more Photos on
click me!

Recommended Stories