అది కూడా చేయలేనప్పుడు ఆ పొజిషన్‌లో ఉండి ఏం లాభం... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలపై పాక్ మాజీ క్రికెటర్...

Published : Nov 15, 2021, 02:57 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు పరాజయం, టీమిండియాలో లుకలుకలు తెచ్చేలానే కనిపిస్తోంది. టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న విరాట్ కోహ్లీ, వన్డేల నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతుండడంతో పాటు రవిశాస్త్రి చేసిన కామెంట్లు హాట్ టాపక్ అవుతున్నాయి. 

PREV
110
అది కూడా చేయలేనప్పుడు ఆ పొజిషన్‌లో ఉండి ఏం లాభం... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలపై పాక్ మాజీ క్రికెటర్...

టీమ్ సెలక్షన్ విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీకి, తనకి ఎలాంటి అధికారం ఉండదని, పూర్తిగా సెలక్టర్లే టోర్నీ ఆడాల్సిన 15 మందిని ఎంపిక చేస్తారని హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి కామెంట్ చేశాడు...

210

కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయానికి కూడా సెలక్టర్లు విలువ ఇవ్వరని, కేవలం ఎంపికైన 15 మంది నుంచి ప్లేయింగ్ ఎలెవన్ టీమ్‌ను ఎంచుకోవడానికి మాత్రమే తనకూ, కెప్టెన్ కోహ్లీకి స్వేచ్ఛ ఉంటుందని షాకింగ్ విషయం వెల్లడించాడు రవిశాస్త్రి...

310

‘అసలు అదెలా సాధ్యం. టీమ్ సెలక్షన్ విషయంలో కోచ్ రవిశాస్త్రికి, కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎలాంటి అధికారం ఉండదని తెలిసి ఆశ్చర్యపోయాను...  

410

ఈ ఇద్దరూ దాదాపు ఐదేళ్లుగా తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఏ ప్లేయర్‌ బలాలు, బలహీనతలేంటో వీరికి బాగా తెలుసు...

510

కోచ్, కెప్టెన్ కలిసి జట్టు క్రికెట్ బ్రాండ్‌ని డిసైడ్ చేస్తారు. కనీసం వాళ్లకి ఏ ప్లేయర్‌ని ఎంపిక చేసుకోవాలనే విషయంలో కూడా స్వేచ్ఛ లేకపోతే ఇక వాళ్లేం చేయగలరు...

610

కెప్టెన్, కోచ్ అనేవాళ్లు జట్టు బ్రాండ్‌ని రిప్రెంజెట్ చేస్తారు. టీమ్‌లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనే విషయాన్ని కూడా వాళ్లు నిర్ణయించలేనప్పుడు, ఇక ఆ పొజిషన్‌లో ఉండి ఏం లాభం...

710

టెస్టుల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు గత ఐదేళ్లుగా టాప్‌లో దూసుకుపోతోంది... అతను తనంతట తాను కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటే తప్ప, కోహ్లీని తప్పించే సాహసం ఎవ్వరూ చేయరనే అనుకుంటున్నా...

810

ఎందుకంటే టెస్టుల్లో జట్టును నెం.1 టీమ్‌గా నిలిచిన వ్యక్తికి కెప్టెన్సీ స్కిల్స్ లేవని చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది...

910

భవిష్యత్తులో టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుని, బ్యాటింగ్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాలని విరాట్ కోహ్లీ భావించవచ్చు. అయితే అది ఇప్పట్లో కాదని నా నమ్మకం...

1010

క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బ్యాట్స్‌మెన్లుగా నిలిచినవారిలో చాలామంది కెప్టెన్సీ నుంచి తప్పుకుని, పూర్తిగా బ్యాటింగ్ పైన ఫోకస్ చేసినవాళ్లే... ’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...

Read more Photos on
click me!

Recommended Stories