ఇషాన్ కిషన్ విధ్వంసం.. రోహిత్, గౌతమ్ గంభీర్ కు టెన్షన్.. !

First Published | Aug 19, 2024, 11:28 AM IST

Ishan Kishan : భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు బుచ్చిబాబు టోర్నీలో అద్భుత బ్యాటింగ్ తో సెంచ‌రీ కొట్టాడు.
 

Ishan Kishan

Ishan Kishan : టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్, ముంబై ప్లేయ‌ర్ ఇషాన్ కిషన్ బ్యాట్ తో అద‌ర‌గొడుతున్నారు.  చాలా కాలం నుంచి భార‌త సీనియ‌ర్ జ‌ట్టుకు దూర‌మైన అత‌ను రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా పునరాగమనం చేశాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు బుచ్చిబాబు టోర్నీలో ప్ర‌స్తుతం ఆడుతున్న ఇషాన్ ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. 

Ishan Kishan

జార్ఖండ్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న ఇషాన్ కిష‌న్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. రెండో ఇన్నింగ్స్ లోనూ బ్యాటింగ్ తో రాణించి మధ్యప్రదేశ్‌పై తన జట్టును అద్భుత విజయాన్ని అందించాడు. 


Ishan Kishan

భారత్ తరఫున టెస్టుల్లో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న ఇషాన్ తొలి ఇన్నింగ్స్‌లో 114 బంతుల్లో 107 పరుగులు చేశాడు. కేవలం 86 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఎడమచేతి వాటం వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మళ్లీ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి, అజేయంగా 41 పరుగులు చేసి జార్ఖండ్‌కు విజ‌యాన్ని అందించాడు. 

విజయానికి 12 పరుగులు చేయాల్సి ఉండగా రెండు వికెట్లు మాత్రమే మిగిలాయి. ఇషాన్ మ్యాచ్‌ని తన చేతుల్లోకి తీసుకుని, ఎంపీ బౌలర్ ఆకాష్ రజావత్ వేసిన బంతిని రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

ఇషాన్ కిష‌న్ రంజీ ట్రోఫీలో పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. అతను చివరిగా డిసెంబర్ 2022లో దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉండాలనే అతని నిర్ణయం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)తో సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయేలా చేసింది.

ఇప్పుడు బుచ్చిబాబు టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచి అందరి హృదయాలను గెలుచుకున్నాడు ఇషాన్. కాబ‌ట్టి అత‌ను రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరపున ఆడటం చూడవచ్చు. అతను ఇలాగే ఆడుతూ ఉంటే ప్రధాన కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మల టెన్షన్ పెరుగుతుందని చెప్ప‌డంలో సందేహం లేదు. ఎందుకంటే జ‌ట్టులోకి వ‌చ్చే ప్లేయ‌ర్ల రేసులో తాను కూడా ఉంటాడు.

Latest Videos

click me!