కేకేఆర్ టీమ్ నుంచి రింకూ సింగ్ ఔట్.. అత‌ని డ్రీమ్ టీమ్ ఏదంటే..?

Published : Aug 19, 2024, 01:27 PM IST

Rinku Singh IPL 2025 : ఐపీఎల్ 2025 సీజ‌న్ కు ముందు మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ జ‌ట్ల‌లో మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయి. కేకేఆర్ స్టార్ ప్లేయ‌ర్ రింకూ సింగ్ కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.  

PREV
15
కేకేఆర్ టీమ్ నుంచి రింకూ సింగ్ ఔట్.. అత‌ని డ్రీమ్ టీమ్ ఏదంటే..?
Virat Kohli, Rinku Singh, IPL 2025

Rinku Singh IPL 2025 : రాబోయే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో అన్ని జ‌ట్ల‌లో ప్లేయ‌ర్ల మార్పులు జ‌ర‌గ‌నున్నాయి. ఎందుకంటే ఐపీఎల్ 2025 ఎడిష‌న్ కు ముందు మెగా వేలం నిర్వ‌హించ‌నున్నారు. కాబ‌ట్టి ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక జట్టు కేవలం 4 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవచ్చు. మిగ‌తా ప్లేయ‌ర్ల‌ను విడిచిపెట్టాల్సి ఉంటుంది.

25

ఇప్ప‌టికే బీసీసీఐ రాబోయే ఐపీఎల్ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే సీజన్‌లోపు మెగా వేలం నిర్వహించాల్సి ఉండ‌టంతో బీసీసీఐతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో వ‌రుస‌గా సమావేశాలు నిర్వ‌హిస్తోంది. కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయ‌ని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. న‌లుగురు ప్లేయ‌ర్ల మాత్రమే ఉంచుకోవాల‌నే నిబంధ‌న విష‌యంలో అన్ని ఫ్రాంఛైజీలు ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోయాయి. 

35
Rinku singh,

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకుంది. యంగ్ స్టార్ రింకూ సింగ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. వచ్చే సీజన్‌లో రింకూ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతాడా? లేదా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. అతడిని కోల్‌కతా జట్టు అట్టిపెట్టుకుంటుందా లేదా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

45
Virat Kohli, RohitSharma

ఈ క్ర‌మంలోనే రింకూ సింగ్ ను ప్ర‌శ్నించ‌గా అత‌ను ఇచ్చిన సమాధానం వైర‌ల్ గా మారింది. త‌నకు ఇష్ట‌మైన ఇత‌ర జ‌ట్ల‌ను కూడా రింకూ పేర్కొన్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తనను విడుదల చేస్తే స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)లో చేరాలనుకుంటున్నట్లు రింకూ సింగ్ చెప్పాడు. రింకు 2018లో కేకేఆర్ నుంచి ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై వరుసగా 5 సిక్సర్లు బాదడంతో వెలుగులోకి వ‌చ్చాడు. 

 

55

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ గురించి అడగ్గా, అతను చాలా ప్రశాంతమైన కెప్టెన్ అని సమాధానమిచ్చాడు. "అతను చాలా మంచి కెప్టెన్. నేను రోహిత్ భాయ్ నాయకత్వంలో ఆడాను. అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు.  ఎక్కువ మాట్లాడడు. అతను టీ20 ప్రపంచ కప్ 2024 జట్టు కోసం చాలా మంచి కెప్టెన్" అంటూ రోహిత్ పై కూడా ప్ర‌శంస‌లు కురిపించాడు. కాగా, ఇప్పుడు రింకూ యూపీ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆగస్టు 25న టోర్నీ ప్రారంభం కానుంది. టోర్నమెంట్‌లో మీరట్ జట్టు తన మొదటి మ్యాచ్‌ను ఆగస్టు 25న ఆడనుంది.

Read more Photos on
click me!

Recommended Stories