IPL 2021: ‘పర్పుల్ క్యాప్’ విన్నర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత... సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత...

Published : Oct 16, 2021, 09:45 AM ISTUpdated : Oct 16, 2021, 09:47 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌కి శుభం కార్డు పడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్, సీజన్‌లో 32 వికెట్లు తీసి ‘పర్పుల్ క్యాప్’ సొంతం చేసుకోగా, సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ సొంతం చేసుకున్నాడు...

PREV
17
IPL 2021: ‘పర్పుల్ క్యాప్’ విన్నర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత... సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ తర్వాత...

ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డీజే బ్రావో 32 వికెట్ల రికార్డును సమం చేసిన హర్షల్ పటేల్, ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు...

27

2010లో సచిన్ టెండూల్కర్, 2016లో విరాట్ కోహ్లీ మాత్రమే ఐపీఎల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలిచిన భారత ప్లేయర్లుగా ఉన్నారు. ఇప్పుడు హర్షల్ పటేల్ వారి సరసన చేరాడు...

37

2008లో షేన్ వాట్సన్, 2009లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, 2011లో క్రిస్ గేల్, 2012లో సునీల్ నరైన్, 2013లో షేన్ వాట్సన్ (రెండోసారి), 2014లో గ్లెన్ మ్యాక్స్‌వెల్... ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు గెలిచారు...

47

ఆ తర్వాత 2015లో ఆండ్రే రస్సెల్, 2016లో విరాట్ కోహ్లీ, 2017లో బెన్ స్టోక్స్, 2018లో సునీల్ నరైన్ (రెండోసారి), 2019లో ఆండ్రే రస్సెల్ (రెండోసారి), 2020లో జోఫ్రా ఆర్చర్ ఈ అవార్డును గెలిచిన వారిలో ఉన్నారు...

57

14 సీజన్లలో కేవలం ముగ్గురు భారతీయులు మాత్రమే ఈ అవార్డు సాధించిన వారిలో ఉన్నారు. హర్షల్ పటేల్ సాధించిన ‘పర్పుల్ క్యాప్’, ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్’ అవార్డులను అతని బదులుగా సీఎస్‌కే ఆల్‌రౌండర్ డీజే బ్రావో అందుకోవడం మరో విశేషం...

67

2008లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన షాన్ మార్ష్ తర్వాత ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ లేదా పర్పుల్ క్యాప్ గెలిచిన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హర్షల్ పటేల్...

77

2021 సీజన్ ఆరంభంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉన్నా, మధ్యలో బ్రేక్ రావడంతో శ్రీలంక టూర్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన రుతురాజ్ గైక్వాడ్... ఈ రికార్డును కోల్పోయాడు...

Must Read: IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...

IPL Final: ధోనీ క్యాచ్ డ్రాప్.. కేబుల్‌కి బాల్ తగలడంలో క్యాచ్ పట్టినా గిల్ నాటౌట్...

click me!

Recommended Stories