IPL 2021 Final: ఆ బాల్‌కి సిక్స్ వచ్చుంటే బాగుండు... కెఎల్ రాహుల్, రుతురాజ్‌కీ ఎంత తేడా...

First Published Oct 15, 2021, 10:59 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్‌కి ఫిక్స్ అయిపోయింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, 45.35 సగటుతో 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు... సీఎస్‌కే మరో ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్ 2 పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్ మిస్ అయ్యాడు... 

అతి పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా నిలవనున్నాడు 24 ఏళ్ల 257 రోజుల వయసున్న రుతురాజ్ గైక్వాడ్. 2008 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన షాన్ మార్ష్ 24 ఏళ్ల 328 వయసులో ఈ ఘనత సాధించాడు...

సీజన్‌లో 45.21 సగటుతో 633 పరుగులు పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఆరెంజ్ క్యాప్ రేసులో రుతురాజ్ గైక్వాడ్‌కి 2 పరుగుల దూరంలో నిలిచాడు. ఒకే సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఒకే ఫ్రాంఛైజీ నుంచి ఇద్దరు ప్లేయర్లు ఉండడం ఇదే తొలిసారి... 

ఈ సీజన్‌లో సీఎస్‌‌కే ఓపెనర్లు ఫాఫ్ డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కూడా 600+ పరుగులు చేశారు. ఇంతకుముందు 2013 సీజన్‌లో ఆర్‌సీబీ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, క్రిస్‌గేల్, 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ మాత్రమే ఒకే ఫ్రాంఛైజీ నుంచి ఈ ఫీట్ సాధించిన వారిగా ఉన్నారు...

ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. 2010లో సచిన్ టెండూల్కర్, 2014లో రాబిన్ ఊతప్ప, 2016లో విరాట్ కోహ్లీ, 2020లో కెఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించారు...

633 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, ఆఖరి బంతికి సిక్సర్ కోసం ప్రయత్నించి అవుట్ కావడంతో ఆరెంజ్ క్యాప్ మిస్ అయ్యాడు. సీఎస్‌కే ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రుతురాజ్ గైక్వాడ్ ఈ విషయం మీద కామెంట్ చేశాడు...

‘ఆఖరి బంతికి డుప్లిసిస్ సిక్స్ కొట్టాలని అనుకున్నా. ఆ పరుగులు జట్టుకి ఎంతో ఉపయోగపడతాయి. ఆరెంజ్ క్యాప్ అతనికి వెళ్లినా నేను సంతోషించేవాడిని... దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు...’ అంటూ కామెంట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్...

ఈ కామెంట్లతో మరోసారి కెఎల్ రాహుల్ ట్రోలింగ్‌కి టార్గెట్ అయ్యాడు. గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకపోయినా, తనకి ఆరెంజ్ క్యాప్ ముఖ్యమన్నట్టుగా మాట్లాడాడు, అలాగే ఆడాడు కెఎల్ రాహుల్...

ఈ సీజన్‌లో కడుపునొప్పి కారణంగా ఓ మ్యాచ్‌కి దూరం కావడం కెఎల్ రాహుల్‌ని ఆరెంజ్ క్యాప్‌కి దూరం చేసింది. అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్‌ను చక్కగా ఉపయోగించుకోకుండా తన ఆరెంజ్ క్యాప్‌కి పోటీగా వస్తాడని రాహుల్ భావిస్తున్నాడని కొన్ని ట్రోల్స్ వచ్చాయి...

తనకి ఆరెంజ్ క్యాప్ ముఖ్యం కాదు, తన పార్టనర్‌కి వచ్చి ఉంటే బాగుండని రుతురాజ్ గైక్వాడ్ వంటి యంగ్ ప్లేయర్ చేసిన కామెంట్లను విన్నాకైనా... ఆటలో విజయం సాధించాలంటే సాటి ప్లేయర్ సక్సెస్‌ను కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలంటూ కెఎల్ రాహుల్‌ను ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్...

click me!