ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ కు శుభ్‌మన్ గిల్ 269 పరుగులు, యశస్వి జైస్వాల్ 87 పరుగులు, జడేజా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 42 పరుగుల ఇన్నింగ్స్ లతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేసింది. రెండవ రోజు ముగిసేసరికి భారత్ ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు పడగొట్టి మంచి స్థితిలో ఉన్నా, మూడవ రోజు దూకుడు తగ్గింది.
ఒక సమయంలో ఇంగ్లాండ్ 84/5 పరుగుల వద్ద ఉండగా, బ్రూక్, స్మిత్ కలిసి కేవలం 90 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్మిత్ ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో ఒక్క ఓవర్లో నాలుగు బౌండరీలు, ఒక సిక్స్ సాధించి మ్యాచ్ రూపాన్ని మార్చేసే ఇన్నింగ్స్ ను ఆడాడు.
ఇంగ్లండ్, ఒక్కసారిగా స్కోరింగ్ రేట్ పెంచి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచింది. స్పిన్నర్లు రంగంలోకి దిగిన తర్వాత కూడా జడేజా, వాషింగ్టన్‌లపై స్మిత్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలతో సెంచరీ కొట్టాడు.