Google's Year In Search 2023: ప్ర‌పంచంలోని టాప్-10 అథ్లెట్లలో శుభ్‌మన్ గిల్..

First Published | Dec 12, 2023, 1:18 PM IST

Most searched people on Google in 2023:  ప్ర‌పంచవ్యాప్తంగా 2023లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో అమెరికా ఫుట్ బాల్ సూప‌ర్ స్టార్ డ‌మ‌ర్ హామ్లిన్ టాప్ లో ఉండ‌గా, భార‌త క్రికెట్ ప్లేయ‌ర్ శుభ్‌మన్ గిల్ టాప్-10 లో చోటుద‌క్కించుకున్నాడు.

Shubman Gill

Google Year in Search 2023: అమెరికన్ ఫుట్ బాల్ సూప‌ర్ స్టార్ డమర్ హామ్లిన్ 2023 లో గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేయ‌బ‌డిన అథ్లెట్ గా పారిస్ సెయింట్-జర్మైన్ సాకర్ సంచలనం కైలియన్ ఎంబాపెను అధిగమించాడు. ఈ లిస్ట్ లో భార‌త క్రికెట్ ప్లేయ‌ర్ శుభ్‌మన్ గిల్ టాప్-10 లో చోటుద‌క్కించుకున్నాడు. 
 

Shubman Gill

1999 లో జన్మించిన భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తన స్టైల్ స్ట్రోక్ ప్లే తో స్టార్ ప్లేయ‌ర్ గా ఎదిగాడు. ప్ర‌స్తుతం భార‌త క్రికెట్ టీమ్ లో కీ ప్లేయ‌ర్. ప్రతిభావంతుడైన ఓపెనింగ్  బ్యాటర్. భారత క్రికెట్ భవిష్యత్తు దిగ్గజంగా గుర్తింపు సాధించాడు.  
 


Shubman Gill

అండర్-19 వరల్డ్ కప్ లో తన ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తనదైన బ్యాటింత్ స్టైత్ తో అదరగొడుతూ.. బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ త‌ర్వాత భార‌త్ నుంచి వ‌స్తున్న స్టార్ క్రికెట్ గా గుర్తింపు సంపాదించాడు. 

Shubman Gill

2023 సంవత్సరంలో అత్యధికంగా సెర్చ్ చేసిన అథ్లెట్లలో భారత క్రికెట్  స్టార్ శుభ్‌మన్ గిల్ ఒకడని గూగుల్ తమ సంవత్సరాంతపు 'గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్' ప్రక్రియలో భాగంగా వెల్లడించింది. ప్రముఖ ఎన్బీఏ ఆటగాడు కేరీ ఇర్వింగ్ కంటే ఒక స్థానం ముందు గిల్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 
 

Shubman Gill

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఓపెనింగ్ చేసి వరుసగా రెండో ఏడాది ఫైనల్ కు చేరడంలో శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. 
 

Shubman Gill

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీని చేపట్టడం ద్వారా ఈ యువ ఆటగాడు తన సంవత్సరాన్ని ముగించాడు, అదే సమయంలో ఐసిసి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 లో భారతదేశం ఫైనల్ చేరడంలో సహాయపడ్డాడు. 2023 చివరి నాటికి, గిల్ తన తోటివారిలో ఉత్తమ వన్డే బ్యాట‌ర్ గా నిలిచాడు.
 

Shubman Gill

ఐసీసీ వ‌న్డే ర్యాంకిగ్స్ లో శుభ్ మ‌న్ గిల్ టాప్ లో కొన‌సాగుతున్నాడు. 826 పాయింట్ల‌తో గిల్ టాప్ లో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో బాబార్ ఆజాం, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌, మిచెల్ ఉన్నారు. 
 

Latest Videos

click me!