Virender Sehwag, Harry Brook
Fastest Triple Century Record: అంతర్జాతీయ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న అనేక రికార్డులు సుసాధ్యం అయ్యాయి. ఊహించని రికార్డులు నమోదుతో పాటు తర్వాతి కాలంలో వాటిని బ్రేక్ చేసిన ప్లేయర్లు కూడా ఉన్నారు. అలాంటి సూపర్ రికార్డులలో ట్రిపుల్ సెంచరీ ఒకటి. చాలా కాలం తర్వాత ముల్తాన్‌లో పాకిస్థాన్‌పై హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ చేసి సెహ్వాగ్‌ని గుర్తు చేశాడు. అయితే, మొత్తంగా క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డులు గమనిస్తే టాప్ లో భారత్ స్టార్ ప్లేయర్ ఉన్నారు. ఇప్పటివరకు ఫాస్టెస్ట్ ట్రిపులు సెంచరీలు కొట్టిన టాప్-5 ప్లేయర్ల ఇన్నింగ్స్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. వీరేంద్ర సెహ్వాగ్
అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ సాధించిన ప్లేయర్లలో భారత ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాట్ టాప్ లో ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్ ముల్తాన్ రికార్డును ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ బ్రూక్ బద్దలు కొట్టినప్పటికీ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ విషయంలో సెహ్వాగ్ టాప్ లోనే ఉన్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ దక్షిణాఫ్రికాపై చెన్నైలో 304 బంతుల్లో 42 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 319 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అతని స్ట్రైక్ రేట్ 104.93. సెహ్వాగ్ 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. తక్కువ బంతుల్లో సాధించిన ట్రిపుల్ సెంచరీ ఇది.
2. హ్యారీ బ్రూక్
అత్యంత వేగంగా తక్కువ బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ప్లేయర్ల జాబితాలో ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. అతను మాథ్యూ హేడెన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 300 మార్కును చేరుకోవడానికి బ్రూక్ 310 బంతులు ఆడాడు. పాకిస్థాన్‌పై 322 బంతుల్లో 317 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్ గా ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ 823 పరుగులకు ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.
గతంలో ఇదే వేదికపై భారత స్టార్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఇప్పుడు హ్యారీ బ్రూక్ ముల్తాన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల రికార్డును అధిగమించాడు. సెహ్వాగ్ ఇక్కడ పాకిస్తాన్‌పై 309 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
3. వాలీ హమ్మండ్
147 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ ఎప్పుడూ ప్రపంచంలోనే అత్యంత పోటీతత్వ జట్లలో ఒకటిగా కొనసాగుతోంది. చాలా మంది ప్లేయర్లు అసాధారణమైన ఆటతో అదరగొట్టారు. అలాంటి ప్లేయర్లలో వాలీ హమ్మండ్ ఒకరు.
అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ సాధించిన ప్లేయర్లలో ఇంగ్లాండ్ లెజెండ్ వాలీ హమ్మండ్ మూడో స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 355 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అది 1933లో హమ్మండ్‌కి అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ.
Matthew Hayden
4. మాథ్యూ హేడెన్
అంతర్జాతీయ క్రికెట్ లో గొప్ప బ్యాటర్లలో మాథ్యూ హేడెన్ ఒకరు. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ హేడెన్ అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన ప్లేయర్ల లిస్టులో నాల్గో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ 2003లో జింబాబ్వేపై 362 బంతుల్లో 380 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 38 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. హేడెన్ 362 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
cricket virender sehwag
5. వీరేంద్ర సెహ్వాగ్
2004లో ముల్తాన్ లో పాకిస్థాన్ పై 309 పరుగులు, 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేసిన భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ (300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు) సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
ముల్తాన్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఆడిన ట్రిపుల్ సెంచరీ ఇన్నింగ్స్‌నే 5వ స్థానం ఉంది. 309 పరుగుల ఇన్నింగ్స్ తర్వాత సెహ్వాగ్ 'సుల్తాన్ ఆఫ్ ముల్తాన్' ట్యాగ్‌ను అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వీరూ 364 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఫార్మాట్ ఏదైనా ధనాధన్ ఇన్నింగ్స్ లకు పెట్టింది పేరు.