కోహ్లీ నుండి కేన్ విలియమ్సన్ వ‌ర‌కు: భారత్ vs న్యూజిలాండ్ వన్డేల్లో అత్యధిక పరుగుల టాప్-10 ప్లేయర్లు

Published : Feb 28, 2025, 03:47 PM IST

Champions Trophy 2025: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత్, మార్చి 2, దుబాయ్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది.  

PREV
16
కోహ్లీ నుండి కేన్ విలియమ్సన్ వ‌ర‌కు: భారత్ vs న్యూజిలాండ్ వన్డేల్లో అత్యధిక పరుగుల టాప్-10 ప్లేయర్లు

India vs New Zealand: ఛాంపియ‌న్స్ ట్రోఫీలో మ‌రో బిగ్ ఫైట్ కు భార‌త్ సిద్ధ‌మైంది. మార్చి 2 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే చివరి గ్రూప్ A మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది.

రెండు జ‌ట్లు ఇప్ప‌టికే వ‌రుస విజ‌యాల‌తో సెమీస్ కు చేరుకున్నాయి. సెమీస్ మ్యాచ్ ను మ‌రింత జోరుగా కొన‌సాగించ‌డానికి త‌మ చివ‌రి గ్రూప్ మ్యాచ్ లో విజ‌యం సాధించాల‌ని చూస్తున్నాయి. అయితే, భారత్ vs న్యూజిలాండ్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్-10 బ్యాట్స్‌మెన్ ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం.

26
Image Credit: Getty Images

1. సచిన్ టెండూల్కర్

భారత మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌తో 42 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 1750 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 186 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. స‌చిన్ మొత్తంగా త‌న వ‌న్డే క్రికెట్ కెరీర్ లో 463 మ్యాచ్ ల‌ను ఆడి 18426 ప‌రుగులు చేశాడు.     

2. విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో 31 వన్డే మ్యాచ్‌లు ఆడి 58.75 సగటుతో ఇప్పటివరకు 1645 పరుగులు చేశాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ ఇప్ప‌టివ‌ర‌కు 299 వ‌న్డేల్లో 14085 ప‌రుగులు చేశాడు.  

36
Ross Taylor Virat Kohli

3. రాస్ టేలర్

న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ భారత్‌తో జరిగిన 35 వన్డే మ్యాచ్‌ల్లో పాల్గొని 47.75 సగటుతో 1385 పరుగులు చేశాడు.రాస్ టెల‌ర్ త‌న కెరీర్ లో మొత్తం 236 వ‌న్డేలు ఆడి 8607 ప‌రుగులు సాధించాడు. 

4. నాథన్ ఆస్టిల్

న్యూజిలాండ్ మాజీ ప్లేయ‌ర్ నాథన్ ఆస్టిల్ భారత్‌తో మొత్తం 29 వన్డేలు ఆడి 1207 పరుగులు చేశాడు. అత‌ని అత్యధిక వ్యక్తిగ‌త‌ స్కోరు 120 ప‌రుగులు. అత‌ను మొత్తం 223 వ‌న్డేలు ఆడి 7090 ప‌రుగులు చేశాడు.  

46
cricket virender sehwag

5. వీరేంద్ర సెహ్వాగ్

భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ న్యూజిలాండ్‌తో జరిగిన మొత్తం 23 వన్డేల్లో పాల్గొని 52.59 సగటుతో 1157 పరుగులు చేశాడు. సెహ్వాగ్ మొత్తంగా 251 వ‌న్డేలు ఆడి 8273 ప‌రుగులు చేశాడు. 

6. కేన్ విలియమ్సన్

న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియమ్సన్ భారత్‌తో 29 వన్డే మ్యాచ్‌లు ఆడి 44.11 సగటుతో ఇప్పటివరకు 1147 పరుగులు చేశాడు. కేన్ మామ మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 170 వన్డేలు ఆడి 7041 ప‌రుగులు చేశాడు. 

56
Kane Williamson

7. మొహమ్మద్ అజారుద్దీన్

భారత మాజీ బ్యాటర్ మహ్మద్ అజారుద్దీన్ న్యూజిలాండ్‌తో 40 వన్డే మ్యాచ్‌లు ఆడి 1118 పరుగులు చేశాడు. 108 పరుగుల అత్యధిక స్కోరుతో అజేయ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అతను తన వన్డే కెరీర్ లో మొత్తం 334 మ్యాచ్ లను ఆడి 9378 పరుగులు చేశాడు.  

8. స్టీఫెన్ ఫ్లెమింగ్

న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్‌మన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ భారత్‌తో 40 వన్డే మ్యాచ్‌ల్లో ఆడి 32.29 సగటుతో 1098 పరుగులు చేశాడు. ఫ్లెమింగ్ మొత్తం 280 వన్డే మ్యాచ్ లను ఆడి 8037 పరుగులు సాధించాడు.

66

9. సౌరవ్ గంగూలీ

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్‌తో మొత్తం 32 వన్డేలు ఆడి 1079 పరుగులు చేశాడు, అత్యధిక స్కోరు 153 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. గంగూలీ తన కెరీర్ లో మొత్తం 311 వ‌న్డే మ్యాచ్ ల‌ను ఆడి 11363 ప‌రుగులు చేశాడు. 

10. రాహుల్ ద్రవిడ్

భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ న్యూజిలాండ్‌తో 31 వన్డేలు ఆడాడు. 41.28 సగటుతో 1032 పరుగులు చేశాడు. ది వాల్ త‌న వ‌న్డే కెరీర్ లో మొత్తం 344 మ్యాచ్ ల‌ను ఆడి 10889 ప‌రుగులు చేశాడు. 

Read more Photos on
click me!

Recommended Stories