ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు అయితే ఏ జట్టు టోర్నీ నుంచి ఔట్ అవుతుంది?
వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చనీ, మ్యాచ్ కాస్త ఆలస్యం కావచ్చని సమాచారం. మ్యాచ్ ఫలితం కోసం రెండు జట్లు కనీసం 20-20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. లీగ్ రౌండ్‌లో రిజర్వ్ డే లేదు. కాబట్టి మ్యాచ్ 20-20 ఓవర్లు జరగకపోతే ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు చేస్తారు.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే, పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లు కలిగి ఉన్న ఆస్ట్రేలియా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. ఇదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్ ఆశలు అడియాసలవుతాయి. ఆ టీమ్ 3 మ్యాచ్‌లలో మొత్తం 3 పాయింట్లు కలిగి ఉంటుంది. దాని పాయింట్లు దక్షిణాఫ్రికా పాయింట్లకు సమానంగా ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్‌లో ఆఫ్ఘనిస్తాన్ చాలా వెనుకబడి ఉంది.
ఆఫ్ఘన్ నెట్ రన్ రేట్ -0.990 ఉండగా, దక్షిణాఫ్రికా +2.140 నికర రన్ రేట్‌తో ఉంది. అలాగే, సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌తో కూడా ఒక మ్యాచ్ ఆడాలి. ఓడిపోయినా, నికర రన్ రేట్‌లో ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందంజలో ఉంటుంది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు అయితే, ఆఫ్ఘన్ టీమ్ నష్టం. ఆసీస్ సెమీస్ చేరుతుంది.