ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ ను వర్షం దెబ్బకొడుతుందా?
వాతావరణ నివేదికల (Weather Report) ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ ను వర్షం (Rain) దెబ్బకొట్టే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం లాహోర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాడ్ వెదర్ కారణంగా ఒక మ్యాచ్ ను ఆసీస్ కోల్పోయింది. అలాగే, పాకిస్తాన్-బంగ్లాదేశ్ మ్యాచ్ సైతం భారీ వర్షం కారణంగా రద్దు అయింది.
ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలో వాతారణం (Weather) ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే, ఆస్ట్రేలియా అత్యుత్తమ నెట్ రన్ రేట్ కారణంగా సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా ఎక్కడ జరుగుతుంది?
ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.