Ravi Shastri: అవును.. నన్ను పంపించేందుకు ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమే.. బాంబు పేల్చిన రవిశాస్త్రి

Published : Dec 10, 2021, 09:18 PM IST

Ravi Shastri Shocking Comments: ఇప్పటికే టీమిండియా వన్డే కెప్టెన్సీ పై భారత క్రికెట్ లో  తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తున్న తరుణంలో  భారత జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

PREV
110
Ravi Shastri: అవును.. నన్ను పంపించేందుకు ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవమే.. బాంబు పేల్చిన రవిశాస్త్రి

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి సంచలన  వ్యాఖ్యలు చేశాడు. తాను రెండోసారి  భారత జట్టుకు ప్రధాన శిక్షకుడిగా నియమితుడైనప్పుడు తనను జట్టునుంచి సాగనంపడానికి ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించాడు. 

210

అంతేగాక తనను జట్టు నుంచి దూరం చేయడానికి ఒక వ్యక్తిని కూడా ప్రయోగించారని ఆరోపించాడు. టీమిండియా హెడ్ కోచ్ గా ఇటీవలే రిటైరైన ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 

310

రవిశాస్త్రి మాట్లాడుతూ... ‘ఓ పెద్ద వివాదం (టీమిండియా కోచ్ గా కుంబ్లే.. కెప్టెన్ గా కోహ్లీకి మధ్య విభేదాలు) తర్వాత నేను రెండో సారి బాధ్యతలు చేపట్టాను. అయితే నన్ను ఆ పదవి నుంచి సాగనంపడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. 

410

అందుకోసం వారు (రవిశాస్త్రిని తప్పించాలని చూసినవాళ్లు.. అయితే వాళ్లెవరనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు..) ఒక వ్యక్తి (?)ని ఎంచుకున్నారు. నేను రెండో సారి  హెడ్ కోచ్ అయిన తర్వాత సరిగ్గా  తొమ్మిది నెలలకు ఆ  వ్యక్తిని నాపై ప్రయోగించారు. 

510

అయితే ఈ విషయంలో నేను ఎవరినీ (బీసీసీఐ) నిందించదలుచుకోలేదు. జట్టుతో అనుబంధమున్న ఓ వ్యక్తి నేను కోచ్ గా ఉండటం ఇష్టం లేకే అలా చేశారు. నన్ను హెడ్ కోచ్ పదవికి దూరంగా ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలైతే జరిగాయని మాత్రం కచ్చితంగా చెప్పగలను...’అని రవిశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశాడు. 

610

ఇప్పటికే టీమిండియా లో వన్డే కెప్టెన్సీ మార్పుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరున్న కోహ్లీని కాదని రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పడమేంటని పలు సీనియర్లు బాహాటంగానే బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు మరింత వేడి కలిగించాయి. 

710

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీకి, రవిశాస్త్రికి మధ్య విభేదాలున్న మాట బహిరంగ వాస్తవమే. ఇటీవలే కోచ్ గా రిటైరయ్యాక స్వయంగా రవిశాస్త్రి కూడా ఈ విషయాన్ని చెప్పాడు. తనకంటే జూనియర్ అయిన గంగూలీ దగ్గరకువెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వడం తనకు చిన్నతనంగా అనిపించిందని అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 
 

810

అదీగాక బీసీసీఐ చీఫ్ అయ్యాక కూడా గంగూలీ.. రవిశాస్త్రి పై అసహనంగా ఉన్నా విరాట్ కోహ్లీ కోరిక మేరకు ఆయననే కొనసాగించినట్టు వార్తలు వచ్చాయి. కోహ్లీ  పూర్తి ఫామ్ లో ఉన్నప్పుడు ఏది కావాలంటే అది ఇచ్చిన బీసీసీఐ.. గత కొద్దికాలంగా అతడు ఫామ్ కోల్పోవడంతో ఇక సాగనంపే ప్రయత్నాలను చేస్తున్నది.

910

టీ20 కెప్టెన్ గా తప్పుకున్న కోహ్లీపై వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాలని ఆదేశించింది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో రెండు ఫార్మాట్లకు ఇద్దరు సారథుల ఫార్ములా భారత జట్టుకు కీడు చేస్తుందనే ఆరోపణతో విరాట్ ను టెస్టులకే పరిమితం చేసినా దీని వెనుక కూడా బీసీసీఐ పాలిటిక్స్ చేసిందని ఆరోపించేవారు లేకపోలేదు. 

1010

రవిశాస్త్రి పదవీకాలం ముగియడం.. కోహ్లీ టీ20 కెప్టెన్ నుంచి తప్పుకోవడం..  ఆ వెంటనే వన్డే కెప్టెన్సీ కూడా కోల్పోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఈ ఉదంతాల వెనుక బీసీసీఐ పాలిటిక్స్ కనిపిస్తున్నాయని భారత క్రికెట్ అభిమానులు  అనుకుంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories