Mayank Agarwal: టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పై భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సంజయ్ బంగర్ లు ప్రశంసలు కురిపించారు. గతంతో పోలిస్తే మయాంక్ బాగా ఆడుతున్నాడని, ముఖ్యంగా....
త్వరలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న టీమిండియాలో టెస్టు జట్టులో మయాంక్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లిద్దరు వీవీఎస్ లక్ష్మణ్, సంజయ్ బంగర్ లు ఈ ఓపెనర్ పై ప్రశంసలు కురిపించారు.
28
లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టుతో పోలిస్తే ముంబై టెస్టులో మయాంక్ బాగా మెరుగయ్యాడు. ముఖ్యంగా అతడు తన ఫుట్ వర్క్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు.
38
పాజిటివ్ దృక్పథంతో ఆడుతున్న మయాంక్.. తనను తాను బాగా నమ్ముతున్నాడు. ఆత్మవిశ్వాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడు. అతడు క్రీజులోకి వచ్చినప్పుడు అది స్పష్టంగా కనిపిస్తున్నది.
48
కాన్పూర్ లో చేసిన తప్పులను అతడు ముంబైలో చేయలేదు. తొలి టెస్టులో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను ఆడి రెండు ఇన్నింగ్సులలోనూ ఔటయ్యాడు. కానీ ముంబై లో ఆ తప్పు చేయలేదు. రెండో టెస్టులో కూడా సౌథీ,జెమీసన్ అటువంటి బంతులు విసిరినా వాటిని వదిలేశాడు.
58
అదే సమయంలో మయాంక్ స్పిన్ బాగా ఆడుతున్నాడు. ముఖ్యంగా ముంబై టెస్టులో పది వికెట్లు తీసిన అజాజ్ పటేల్ బౌలింగ్ లో మయాంక్ చూడచక్కని షాట్లు కొట్టాడు. స్పిన్ ఆడటంలో కీలకమైన ఫుట్ వర్క్ ను మెరుగుపర్చుకున్న మయాంక్.. ఆ టెస్టులో అద్భుతమైన షాట్లు ఆడాడు..’ అని లక్ష్మణ్ తెలిపాడు.
68
ఇక బంగర్ మాట్లాడుతూ.. ‘మయాంక్ బ్యాటింగ్ శైలి ప్రశంసనీయం. టర్న్, బౌన్స్ అధికంగా ఉండే ముంబై పిచ్ పై అతడు చాలా సమర్థవంతంగా ఆడాడు. టిమ్ సౌథీని అతడు ఎదుర్కొన్న విధానం చూడముచ్చటగా అనిపించింది. ఎందుకంటే తొలి టెస్టులో సౌథీ.. అతడిని బాగా ఇబ్బందిపెట్టాడు.
78
ముంబై టెస్టులో మయాంక్ పేసర్లపై క్రమశిక్షణ ప్రదర్శించాడు. అలాగే స్పిన్నర్ల ను అవకాశం వచ్చినప్పుడల్లా శిక్షించాడు. అజాజ్ ఎక్కువ ఎత్తులో బంతి వేసినప్పుడల్లా మయాంక్ తన పాదాలను ఉపయోగించి ఏరియల్ షాట్లు ఆడటానికి ప్రయత్నించాడు. టర్న్ తో లాంగ్ షాట్ లు ఆడాడు. అందుకే అతడికి ముంబై టెస్టు బిగ్ అచీవ్మెంట్ గా నేను భావిస్తున్నాను..’ అని బంగర్ చెప్పాడు.
88
ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసిన అగర్వాల్.. రెండో ఇన్నింగ్స్ లో 62 పరుగులు సాధించాడు. దీంతో అతడు ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాకింగ్స్ లో ఏకంగా 30 స్థానాలను ఎగబాకి 11 వ స్థానానికి చేరుకున్నాడు.