ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు రామలింగం అన్నట్టు..!! దాయాది దేశాల పొట్టి పోరుపై అతి చేస్తున్న పాక్ మాజీలు..

Published : Jan 23, 2022, 05:56 PM IST

India Vs Pakistan: ఈ ఏడాది  అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ ఇప్పట్నుంచే మైండ్ గేమ్ మొదలుపెట్టింది.   

PREV
111
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు రామలింగం అన్నట్టు..!! దాయాది దేశాల పొట్టి పోరుపై అతి చేస్తున్న పాక్ మాజీలు..

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే  ఇరు దేశాల అభిమానులకు పూనకం వస్తుంది. ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఆ రోజు  టీవీకి అతుక్కుపోయే అభిమానులు రెండు దేశాల్లో కోట్లాది మంది ఉన్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ పై  పాకిస్థాన్ నెగ్గడంతో ఆ దేశం సంబురాలు చేసుకుంది. 

211

కాగా.. గతేడాది మాదిరే ఈ ఏడాది కూడా ఆస్ట్రేలియాలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే  హైఓల్జేజీ మ్యాచులో కూడా తమదే విజయమని పలువురు పాక్ మాజీలు అతికి పోతున్నారు. 

311

టీ20 ప్రపంచకప్-2022 లో భాగంగా ఈ ఏడాది అక్టోబర్ 23న ఈ రెండుదేశాల మధ్య  మెల్బోర్న్ వేదికగా మరో ఆసక్తికర పోటీ జరుగనున్నది. అయితే ఈ మ్యాచులో కూడా విజయం తమదే అంటున్నారు  పాకిస్థాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్, ఇటీవలే పాక్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహ్మద్ హఫీజ్.. 

411

హఫీజ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తూ నానాటికీ ఎదుగుతున్నది. గతేడాది మాదిరే ఈ సారి కూడా భారత్ పై  కచ్చితంగా గెలుస్తాం. టీమిండియాకు సంబంధించినంతవరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కీలక ఆటగాళ్లు. ఈ ఇద్దరూ ఆడకుంటే మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేరు. పాక్ వంటి మెరుగైన జట్టుతో ఆడేప్పుడు ఈ ఇద్దరూ పరుగులు చేయకుంటే ఆ ప్రభావం ఇతర ఆటగాళ్ల మీద కూడా పడుతుంది.. 
 

511

ఇక ప్రపంచకప్ లో భారత్ పై పాక్ గెలిస్తే ఆ విజయాలలో నేనూ భాగస్వామిని కావాలని గతంలో అనుకునేవాడిని. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా నా కోరిక తీరింది.  అందుకు నేను గర్విస్తున్నాను..’ అని అన్నాడు. 

611

ఇదే విషయమై రావల్పిండి ఎక్స్ప్రెస్ అక్తర్ మాట్లాడుతూ... ‘ఈసారి కూడా మాదే (పాక్) విజయం. వచ్చే టీ20 ప్రపంచకప్ లో  భారత్ పై మరోసారి విజయం సాధిస్తాం.. టీ 20 క్రికెట్ లో భారత్ తో పోలిస్తే పాకిస్థాన్ మెరుగైన జట్టుగానే కనిపిస్తుంది. 

711

రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా భారత్ మీడియా పనిగట్టుకుని టీమిండియాపై అనవసర ఒత్తిడి పెంచుతుంది. ఒకరకంగా అది మాకు సానుకూలంగా మారుతున్నది. భారత జట్టు అందుకే ఓడిపోతుంది..’అని కామెంట్ చేశాడు. 

811

కాగా.. ఈ ఇద్దరు పాక్ మాజీల  వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. టీ20 ప్రపంచకప్-2022 కు ఇంకా చాలా టైమ్ ఉందని, ఇప్పుడే అవాకులు చెవాకులు పేలడం మానితే బెటరని ఈ ఇద్దరు మాజీలకు చురకలు అంటిస్తున్నారు. 
 

911

గతేడాది పాక్ విజయం సాధించిన మాట వాస్తవమేనని, కానీ అంతకుముందు 12 విజయాల సంగతేంటి..? అని ప్రశ్నిస్తున్నారు. తొందరపడి ముందే కూయొద్దు.. కూసి అబాసుపాలు కావొద్దని కామెంట్లు పెడుతున్నారు. 
 

1011

ప్రపంచకప్పులలో భాగంగా ఇప్పటివరకు రెండు జట్లు 13 సార్లు తలపడగా.. అందులో పాక్ గెలిచింది ఒక్కటంటే ఒక్కసారే.. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్  జట్టు..  భారత్ పై పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 
 

1111

ఈ ఏడాది  ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించింది.  అక్టోబర్ 16నుంచి న‌వంబ‌ర్ 13 వ‌ర‌కు సాగే ఈ పొట్టి సమరంలో.. భారత జట్టు అక్టోబర్ 23న  పాక్ తో తలపడనున్నది. 
 

Read more Photos on
click me!

Recommended Stories