ఆరెంజ్ క్యాప్ గెలిచినా ఫలితం లేకపోయింది... రుతురాజ్ గైక్వాడ్‌కి మరోసారి నిరాశే...

First Published Jan 23, 2022, 2:53 PM IST

అతిచిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించిన రుతురాజ్ గైక్వాడ్‌కి ఆ తర్వాత ఒక్క ఛాన్స్ దక్కకపోవడం విశేషం...

ఐపీఎల్ సెకండాఫ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున బరిలో దిగిన వెంకటేశ్ అయ్యర్‌కి ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లోనే అవకాశం ఇచ్చింది టీమిండియా...

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడాడు వెంకటేశ్ అయ్యర్. అయితే వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోలేకపోయాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ సెంచరీతో 635 పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ గెలిచి చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌కి మాత్రం ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా దక్కలేదు...

ఐపీఎల్ తర్వాత జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 5 ఇన్నింగ్స్‌ల్లో 259 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, విజయ్ హాజారే ట్రోఫీలో ఐదు సెంచరీలతో 603 పరుగులు చేశాడు...

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌ని న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేశారు బీసీసీఐ సెలక్టర్లు...

అయితే అక్కడ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలో దిగడంలో ఈ యంగ్ ఓపెనర్‌కి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు...

ఆ తర్వాత సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ కెఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలో దిగడంతో ఇక్కడ కూడా అవకాశం రాలేదు...

టీమిండియాకి మిడిల్ ఆర్డర్‌ సమస్య వెంటాడుతోంది. రెండు వికెట్లు పడిన తర్వాత సరైన భాగస్వామ్యాలు నెలకొల్పే బ్యాట్స్‌మెన్ కనిపించడం లేదు...

కెఎల్ రాహుల్‌కి మిడిల్ ఆర్డర్‌లోనూ రాణించిన అనుభవం ఉంది. మిడిల్ ఆర్డర్ సమస్యను పరిష్కారించాలనుకుంటే కెఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లోకి వెళ్లి, రుతురాజ్‌ను ఓపెనర్‌గా ఆడించవచ్చు...

అయితే కెప్టెన్ కెఎల్ రాహుల్ కానీ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ ఆ దిశగా ఆలోచనలు చేయకపోవడం భారత జట్టు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

click me!