టీ20 క్రికెట్: విరాట్ కోహ్లి పరుగుల రికార్డును బద్దలుకొట్టిన టాప్-5 బ్యాటర్లు

Published : Sep 02, 2025, 03:27 PM IST

Virat Kohli: రన్ మిషన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో క్రికెట్ లో పరుగుల వరద పారించాడు. అయితే, టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాటర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
రన్ మిషన్ విరాట్ కోహ్లీ

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా సరే అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టించడం విరాట్ కోహ్లీ స్టైల్. ఇప్పటికే క్రికెట్ లో అనేక రికార్డులు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో భారత్ కోసం అనేక సూపర్ నాక్ లు ఆడాడు. 

ఇక ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడుతూ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. స్థిరంగా రాణిస్తూ మంచి ప్రదర్శనలతో కోహ్లీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సాధించాడు. అయినప్పటికీ, ఆయనకంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదుగురు బ్యాటర్లు ఉన్నారు. వారి వివరాలు గమనిస్తే..

DID YOU KNOW ?
విరాట్ కోహ్లీ క్రికెట్ రికార్డులు
విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 292 మ్యాచ్‌ల్లో 13,848 పరుగులు చేశాడు. అత్యధిక సెంచరీలు (50) కొట్టాడు. 2023 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై చేసిన సెంచరీతో వన్డేలో అత్యధిక సెంచరీల సచిన్ (49) రికార్డును బద్దలుకొట్టాడు.
26
5. షోయబ్ మాలిక్

పాకిస్తాన్‌కి చెందిన షోయబ్ మాలిక్ టీ20 క్రికెట్‌లో దీర్ఘకాలిక కెరీర్‌తో ప్రసిద్ధి చెందాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయకపోయినా టాప్-5 రన్ స్కోరర్లలో స్థానం సంపాదించాడు. 

తన టీ20 కెరీర్ లో మొత్తం 83 హాఫ్ సెంచరీలు సాధించాడు. పరిస్థితులకు అనుగుణంగా ఇన్నింగ్స్‌ను ఆడగలగడం మాలిక్ ప్రధాన బలం. స్థిరమైన ప్రదర్శనతో ఏ జట్టుకైనా విశ్వసనీయ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 13 వేలకు పైగా టీ20 పరుగులు సాధించాడు.

36
4. డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టీ20 క్రికెట్ లో 13,000 లకు పైగా పరుగులు చేసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఈ రికార్డు సాధించిన ఏకైక ఆస్ట్రేలియా ఆటగాడు కూడా వార్నర్‌నే. ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ ప్రపంచవ్యాప్తంగా బౌలర్లను ఇబ్బంది పెట్టిన స్టార్ బ్యాటర్. టీ20 ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకరిగా ఘనత సాధించారు.

46
3. కీరన్ పోలార్డ్

సూపర్ ఫినిషర్ గుర్తింపు పొందిన కీరన్ పోలార్డ్ టీ20 క్రికెట్ లో అనేక ధనాధన్ ఇన్నింగ్స్ లను ఆడాడు. వెస్టిండీస్ కు చెందిన ఈ స్టార్ ప్లేయర్ టీ20 క్రికెట్ లో 13,000 పైగా పరుగులు సాధించాడు. 

ఇందులో ఒక్క సెంచరీ సాధించాడు. పవర్ హిట్టింగ్, చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయడం పోలార్డ్ ప్రధాన బలం. అనేక లీగ్‌లలో జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ను కలిగి ఉన్నాడు.

56
2. అలెక్స్ హేల్స్

ఇంగ్లాండ్ బ్యాటర్ అలెక్స్ హేల్స్ తాజాగా 14,000 పరుగుల మార్క్ దాటాడు. టీ20 క్రికెట్ లో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు హేల్స్‌నే. ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో అంతగా రాణించలేకపోయినా గ్లోబల్ లీగ్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు.

66
1. క్రిస్ గేల్

యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ అంటే పరుగుల తుఫాను గుర్తుకువస్తుంది. టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ పేరు వింటే బౌలర్లకు దడపుడుతుంది. అలాంటి పవర్ హిట్టింగ్ తో ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా నాక్ లు ఆడాడు. ఇప్పటివరకు 14,000కి పైగా పరుగులు చేశాడు. అలాగే, 22 సెంచరీలు కూడా సాధించాడు. 1,000కి పైగా సిక్సులు బాదాడు. టీ20 క్రికెట్‌ కు కొత్త రూపాన్ని తీసుకొచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories