Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ పదవి నుంచి భారత క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్ తప్పుకున్నారు. ఆయన తప్పుకోవడం వెనుక సంజూ శాంసన్ ఉన్నారనే రూమర్లు కూడా వినిపించాయి. అయితే, తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్ రాయల్స్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ వైదొలగడం వెనుక కారణం ఏంటి?
రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్.. ఒకేఒక్క సీజన్ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాజస్థాన్ జట్టు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేసినప్పటికీ, తాజా నివేదికలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. దీనికి ముందు సంజూ శాంసన్ కారణం అనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది.
DID YOU KNOW ?
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్
2008లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత, రాజస్థాన్ రాయల్స్ 2013, 2015, 2018, 2022, 2024 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
25
జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయాల కారణంగా ద్రావిడ్ తప్పుకున్నారా?
జట్టులో నాయకత్వంపై వచ్చిన విభేదాలే ద్రావిడ్ వైదొలగడానికి అసలు కారణమని భారత క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది. ద్రావిడ్‌కు జట్టులో పెద్ద బాధ్యతలు ఇస్తామని రాయల్స్ మేనేజ్‌మెంట్ హామీ ఇచ్చింది. కానీ కీలక నిర్ణయాల నుంచి ఆయనను దూరంగా ఉంచినట్లు మాజీ సిబ్బంది తెలిపినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా, జట్టు నాయకుడి ఎంపికలో ఆయన అభిప్రాయం పట్టించుకోకపోవడం ద్రావిడ్‌ను నిరాశపరిచిందని సమాచారం.
35
రియాన్ పరాగ్ కారణమా?
సంజూ శాంసన్ జట్టును వదిలే ఆలోచన వ్యక్తం చేసిన తర్వాత రియాన్ పరాగ్‌ను తదుపరి కెప్టెన్‌గా నియమించాలన్న మేనేజ్‌మెంట్ నిర్ణయానికి ద్రావిడ్ ఏకీభవించలేదని సమాచారం. గత సీజన్‌లో సంజూ గాయపడినప్పుడు పరాగ్ ఐదు మ్యాచ్‌లలో నాయకత్వం వహించారు. అయితే అందులో నాలుగు మ్యాచ్‌ల్లో జట్టు ఓటమి పాలైంది. పరాగ్ గత ఆరు సీజన్లుగా రాయల్స్ తరఫున ఆడుతున్నా, 2024 ఒక్క సీజన్‌లోనే 500కి పైగా పరుగులు సాధించారు. మిగతా సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు.
రియాన్ పరాగ్ కంటే యశస్వి జైస్వాల్ ఎక్కువ ప్రతిభావంతుడని ద్రావిడ్ అభిప్రాయం. భారత జట్టులో మూడు ఫార్మాట్లలో స్థానం సంపాదించుకున్న జైస్వాల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా చూడాలని ఆయన కోరుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. జట్టు భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం సరైనదని ద్రావిడ్ నమ్మినట్లు తెలుస్తోంది.
55
సంజూ శాంసన్ రాజస్థాన్ జట్టును వీడుతున్నారా?
సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి తప్పుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. అలా జరిగితే రియాన్ పరాగ్ కెప్టెన్‌గా అవకాశం దక్కుతుందని అంచనా. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ సంజూను తమ జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి.
చెన్నైతో చర్చలు ఫలితం ఇవ్వకపోయినా, కేకేఆర్ ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. కోచ్‌గా ద్రావిడ్, కెప్టెన్‌గా సంజూ కలిసి కోల్ కతా జట్టులో చేరతారేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ ముగిసిన తర్వాత కేకేఆర్ కోచ్ చంద్రకాంత్ పండిట్ కూడా పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.