Published : Dec 26, 2021, 05:10 PM ISTUpdated : Dec 26, 2021, 05:13 PM IST
Ind Vs SA: టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ సెంచరీ చేయక రెండేండ్లు దాటిపోయింది. దక్షిణాఫ్రికా పర్యటనలో అయినా విరాట్.. తిరిగి మునపటి ఫామ్ ను అందుకోవాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు.
దక్షిణాఫ్రికా పర్యటన నిమిత్తం టీమిండియా ప్రస్తుతం అక్కడి సెంచూరియన్ లో తొలి టెస్టు ఆడుతున్నది. అయితే కొన్నాళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ.. ఈసారి మాత్రం అదరగొడతాడని అతడి చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అంటున్నాడు.
29
శర్మ మాట్లాడుతూ.. ‘సెంచూరియన్ లో గత పర్యటన (2018) లో విరాట్ కోహ్లీ చాలా భాగా ఆడాడు. ఈ సారి కూడా అదే ఆటను ఇక్కడ పునరావృతం చేస్తాడని నేను భావిస్తున్నాను.
39
విరాట్ ఫ్యాన్స్ అందరూ అతడు తిరిగి పాత కోహ్లీలా మారిపోవాలని కోరుకుంటున్నారు. అతడు పరిణితి సాధించిన ఆటగాడు. తప్పకుండా రాణిస్తాడు.. చాలాకాలంగా అతడు జట్టుకు నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
49
టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శనలు చేయడానికి అతడెప్పుడూ వెనుకాడడు. దక్షిణాఫ్రికా సిరీస్ లో భాగంగా విరాట్ అభిమానులు ఈసారి ఒకప్పటి కోహ్లీని చూస్తారని నేను విశ్వసిస్తున్నాను.. ’ అని చెప్పుకొచ్చాడు.
59
కాగా.. 33 ఏండ్ల కోహ్లీ రెండేళ్లుగా సెంచరీ చేయలేదు. దీంతో అతడి నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ను అభిమానులు ఆశిస్తున్నారు. ఈ రెండేండ్ల కాలంలో విరాట్ పలు టెస్టులాడినా హాఫ్ సెంచరీల వద్దే నిష్క్రమిస్తున్నాడు. కానీ ఈసారి మాత్రం వాటిని శతకాలుగా మార్చాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
69
గత పర్యటనలో ఇదే సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ.. 153 పరుగులు చేశాడు. కానీ ఆ టెస్టులో భారత్ 135 పరుగుల తేడాతో ఓడిపోయింది.
79
గత కొద్దికాలంగా ఒత్తిడి, వన్డే కెప్టెన్సీ తొలిగింపు, బీసీసీఐ, డ్రెస్సింగ్ రూమ్ లో గ్రూపుల కారణంగా విరాట్ పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు. మునపటి ఫామ్ అతడిలో కనిపించడం లేదని స్వయంగా అతడి ఫ్యాన్సే ఆరోపిస్తున్నారు.
89
ఇదిలాఉండగా.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ అద్భుత ఆరంభాన్నిచ్చారు.
99
40 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు వికెట్ నష్టపోకుండా 113 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్.. 118 బంతుల్లో 8 ఫోర్లు బాది 47 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. 121 బంతుల్లో 56 రన్స్ సాధించాడు. అతడు కూడా 8 ఫోర్లు కొట్టాడు.