అజింకా రహానే అదరగొడితే, ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి... శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారిలకు...

First Published Dec 26, 2021, 4:27 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అజింకా రహానేకి అవకాశం కల్పించిన టీమిండియా, న్యూజిలాండ్ టూర్‌లో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌ను పక్కనబెట్టడంపై తీవ్ర చర్చనీయాంశమవుతోంది...

కాన్పూర్ టెస్టులో విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, తొలి ఇన్నింగ్స్‌లో 105, రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు...

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియా తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన శ్రేయాస్ అయ్యర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా అందుకున్నాడు...

రెండో టెస్టులో అజింకా రహానే గాయం కారణంగా తప్పుకోవడంతో శ్రేయాస్ అయ్యర్‌కి రెండో అవకాశం దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 18, రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేశాడు అయ్యర్...

అయితే ఈ టెస్టు సిరీస్‌లో మయాంక్ అగర్వాల్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రెండో స్థానంలో నిలిచిన శ్రేయాస్ అయ్యర్‌కి సెంచూరియన్ టెస్టులో అవకాశం ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

2017-18 సౌతాఫ్రికా టూర్‌లో మిడిల్ ఆర్డర్‌లో రహానేకి బదులుగా పెద్దగా అనుభవం లేని రోహిత్ శర్మను ఆడించింది భారత జట్టు. ఆ ప్రయోగం అప్పుడు ఘోరంగా ఫెయిల్ అయ్యింది...

మూడో టెస్టులో అజింకా రహానే రీఎంట్రీ ఇవ్వడం, భారత జట్టు గెలవడం జరిగిపోయాయి. అందుకే ఈసారి అలాంటి తప్పు చేయకుండా ఉండేందుకు అనుభవం లేని అయ్యర్‌ను పక్కనబెట్టింది టీమిండియా...

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే భారత్-ఏతో కలిసి అనధికారిక మూడు టెస్టుల సిరీస్ ఆడి, నిరూపించుకున్న తెలుగు క్రికెటర్ హనుమ విహారికి చోటు ఇవ్వకపోవడంపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

ఆస్ట్రేలియా టూర్‌లో సిడ్నీ టెస్టులో అశ్విన్‌తో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు వికెట్లకు అడ్డుగా నిలబడి భారత జట్టును ఓటమి నుంచి కాపాడాడు హనుమ విహారి. అయితే ఆ తర్వాత విహారికి మరో ఛాన్స్ దక్కలేదు...

ఇప్పుడు ఒకవేళ కొంతకాలంగా ఫామ్‌లో లేని అజింకా రహానే... సెంచూరియన్ టెస్టులో 50+ పరుగులు చేస్తే... ఈ ఇద్దరికీ టెస్టు సిరీస్‌లో అవకాశం దొరుకుతుందా? అనేది అనుమానంగా మారింది...

సెంచూరియన్ టెస్టులో రహానే ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇస్తే, అతన్ని తర్వాతి టెస్టుకి తీసి పక్కనబెట్టడం వీలుకాని పని. సీనియర్ ప్లేయర్‌గా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కానీ, కోచ్ రాహుల్ ద్రావిడ్ కానీ రహానేని ఆడించడానికి ప్రాధాన్యం ఇస్తారు. 

అదే జరిగితే శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి తుదిజట్టులో ఛాన్స్ కోసం ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే... ఏ ప్లేయర్‌ అయినా ఘోరంగా ఫెయిల్ అయితే, లేదా గాయపడితేనే మళ్లీ ఈ ఇద్దరికీ అవకాశం దక్కనుంది.

click me!