Published : Dec 26, 2021, 04:57 PM ISTUpdated : Dec 26, 2021, 05:10 PM IST
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టుకి శుభారంభం దక్కింది. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు.
ఓ ఎండ్‌లో కెఎల్ రాహుల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుంటే, మరో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 89 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు మయాంక్ అగర్వాల్...
28
సౌతాఫ్రికాలో టీమిండియా ఇప్పటిదాకా 21 టెస్టులు ఆడగా... ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం నమోదుచేయడం ఇది మూడోసారి. ఇంతకకుముందు 2006-07 పర్యటనలో కేప్ టౌన్ టెస్టులో వసీం జాఫర్, దినేశ్ కార్తీక్ కలిసి తొలి వికెట్‌కి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...
38
2010-11 సఫారీ టూర్‌లో సెంచూరియన్‌లోనే గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి తొలి వికెట్‌కి 137 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ జోడించిన శతాధిక భాగస్వామ్యం మూడోది...
48
సెంచూరియన్‌లో ఆడిన గత 26 టెస్టుల్లో 21 టెస్టులు గెలిచింది సౌతాఫ్రికా. ఇందులో 52 ఇన్నింగ్స్‌ల్లో పర్యాటన జట్టు ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం జోడించడం ఇది రెండోసారి మాత్రమే కావడం మరో విశేషం...
58
విదేశాల్లో సెంచరీ భాగస్వామ్యంతో టెస్టు సిరీస్ ఆరంభించడం భారత జట్టుకి ఇదే తొలిసారి. ఇంతకుముందు 1936లో హింద్లేకర్, విజయ్ మర్చెంట్ కలిసి జోడించిన 62 పరుగులే అత్యుత్తమంగా ఉండేది...
68
2021లో విదేశాల్లో భారత ఓపెనర్లు 20+ ఓవర్లకు పైగా బ్యాటింగ్ చేయడం ఇది ఏడోసారి. గత 10 ఏళ్లలో 2010 నుంచి 2020 వరకూ ఒక్కసారి కూడా భారత ఓపెనర్లు , విదేశాల్లో ఈ ఘనత సాధించలేకపోయారు.
78
123 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్, 9 ఫోర్లతో 60 పరుగులు చేసి ఇంగిడి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 117 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...
88
మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాతి బంతికే ఛతేశ్వర్ పూజారా, భువుమాకి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...