IND vs PAK Fakhar Zaman : ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. సంజూ శాంసన్ క్యాచ్ కు ఫఖర్ జమాన్ అవుట్ అయ్యాడు. అయితే, ఈ క్యాచ్ పై ఫఖర్ తో పాటు పాక్ కోచ్ అసహనంగా కనిపించారు. ఫఖర్ జమాన్ అవుట్ సరైన నిర్ణయమేనా?
సంజూ శాంసన్ క్యాచ్.. షాక్ లో ఫఖర్ జమాన్, పాక్ టీమ్
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే, అతని అవుట్ ఇప్పుడు రచ్చ లేపుతోంది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అతను అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్ పట్టిన అతని క్యాచ్ వివాదంగా మారింది.
వికెట్ల వెనుక సంజూ పట్టిన క్యాచ్ నెలను తాకిందా? లేదా అతని చేతుల్లోనే పడిందా? అనే వివాదం మొదలైంది. అయితే, థర్డ్ అంపైర్ చెక్ చేసిన తర్వాత అవుట్ గా ప్రకటించారు. దీంతో ఫఖర్ తో పాటు పాక్ టీమ్ కూడా షాక్ కు గురైంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.
25
ఫఖర్ అవుట్.. సంజూ క్యాచ్.. థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదం
ఫఖర్ జమాన్ అవుట్ అయిన తర్వాత అతను, పాక్ హెడ్ కోచ్ మైక్ హెసన్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. సంజూ శాంసన్ క్యాచ్ క్లియర్‌గా పట్టాడో కాదో అనేది థర్డ్ అంపైర్ సమీక్షతో నిర్ధారించారు. ఫఖర్ ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే గ్రౌండ్ ను వీడాడు. కానీ, గ్రౌండ్ ను తాకకుండానే బాల్ సంజూ చేతిలో పడింది.
35
ఫఖర్ రియాక్షన్ వైరల్
థర్డ్ అంపైర్ అవుట్ ప్రకటించిన తర్వాత ఫఖర్ షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత గ్రౌండ్ లో అసంతృప్తిని స్పష్టంగా చూపించారు. పిచ్ నుండి బయటకు వెళ్లేముందు మైక్ హెసన్‌తో కూడా ఇదే విషయాన్ని మాట్లాడినట్టు కనిపించింది. ఫఖర్, సైమ్ అయుబ్ స్థానంలో ఓపెనింగ్ కోసం తీసుకుంటే, రెండు బౌండరీలు కొట్టి మంచి టచ్ లో కనిపించాడు. అయితే, హార్దిక్ పాండ్యా అతనికి షాక్ ఇచ్చి పెవిలియన్ కు పంపాడు.
హార్దిక్ పాండ్యా టీ20ల్లో ఫఖర్ జమాన్‌ను అవుట్ చేయడంతో తన 97వ వికెట్ సాధించారు. ఇది భారత్-పాక్ మ్యాచ్‌ల్లో పాండ్యా ప్రతిభను మరోసారి చూపించింది. ఈ మ్యాచ్ లో ఆయన రెండో ఓవర్‌లోనే ఫఖర్‌ను అవుట్ చేసి భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చారు. పాండ్యా ఇప్పటివరకు పాక్ 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.
55
15 పరుగులు చేసిన ఫఖర్ జమాన్
ఫఖర్ జమాన్ 9 బంతులలో 15 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో మూడు బౌండరీలు కొట్టారు. థర్డ్ అంపైర్ సమీక్ష తరువాత అవుట్ అయ్యారు. పాక్ కోచ్ మైక్ హెసన్, ఫఖర్ ఈ నిర్ణయం పై అసహనాన్ని వ్యక్తం చేశారు. దాదాపు అన్ని రీప్లేలు పరిశీలించిన తరువాత అవుట్ నిర్ణయం వచ్చి, ఫఖర్ షాక్‌లో మైదానాన్ని వదిలి వెళ్ళారు. ఈ అవుట్ నిర్ణయం ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో కొత్త రచ్చగా మారింది.