ఆసియా కప్ 2025: బాబర్ ఆజం, రిజ్వాన్ అవుట్

Published : Aug 18, 2025, 05:07 PM IST

Asia Cup 2025: ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ తన జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్ళు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ జట్టు నుండి అవుట్ చేశారు.

PREV
15
ఆసియా కప్ 2025

ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు పాల్గొనే ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్  సెప్టెంబర్ 9న యుఏఈలో ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్ లో జరిగే ఈ టోర్నమెంట్ లో ఇండియా తన తొలి మ్యాచ్ లో సెప్టెంబర్ 10న యుఏఈతో తలపడుతుంది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

DID YOU KNOW ?
ఆసియా కప్ రికార్డులు
ఆసియా కప్ లో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటివరకు 16 ఎడిషన్లు జరగ్గా, 8 సార్లు టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది.
25
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్

ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ తన జట్టును ప్రకటించింది. పలువురు స్టార్ ప్లేయర్లకు జట్టులో చోటుకల్పించలేదు. స్టార్ ఆటగాళ్ళు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ లు పాక్ జట్టు నుంచి అవుట్ అయ్యారు. సల్మాన్ అలీ ఆగా కెప్టెన్సీలో 17 మంది సభ్యుల జట్టులో మహమ్మద్ హారిస్ వికెట్ కీపర్ గా వ్యవహరిస్తారు.

షాహీన్ అఫ్రిది, ఫకర్ జమాన్ జట్టులో ఉన్నారు. హారిస్ రవూఫ్, హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్ వంటి పేసర్లతో పాటు సయీమ్ అయూబ్, హసన్ నవాజ్ వంటి యువ ఆటగాళ్ళు కూడా పాక్ జట్టులో ఉన్నారు.

35
బాబార్ ఆజం, రిజ్వాన్ లను పాకిస్తాన్ జట్టు నుంచి ఎందుకు తప్పించారు?

పాకిస్తాన్ వన్డే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, అలాగే స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఆసియా కప్ లోనే కాదు, ఈ నెలలో వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో కూడా ఆడలేదు. టీ20ల్లో వీరి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటం వల్లనే వారిని జట్టులోకి తీసుకోలేదని పాకిస్తాన్ సెలెక్టర్లు చెప్పారు.

బాబర్ ఆజం చివరిసారిగా 2024 డిసెంబర్ లో పాకిస్తాన్ తరపున టీ20 ఆడాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జట్టు తరపున 128.57 స్ట్రైక్ రేట్ తో 288 రన్స్ మాత్రమే చేశాడు.

45
భారత్-పాకిస్తాన్ : ఆసియా కప్ లో మరో బిగ్ ఫైట్

సెప్టెంబర్ 9న యుఏఈలో ప్రారంభమయ్యే ఆసియా కప్ లో ఇండియా, యుఏఈ, ఒమన్ జట్లతో పాటు పాకిస్తాన్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. సెప్టెంబర్ 12న ఒమన్ తో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న ఇండియాతో తలపడుతుంది.

సెప్టెంబర్ 17న యుఏఈతో పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. ఆసియా కప్ కి ముందు యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో జరిగే ట్రై హోం టీ20 సిరీస్ లో కూడా పాకిస్తాన్ ఆడుతుంది.

55
ఆసియా కప్ కోసం పాకిస్తాన్ జట్టు ఇదే

2023 వన్డే ఆసియా కప్ లో సూపర్ 4కు చేరినా, మూడు మ్యాచ్ లలో రెండింటిలో ఓడిపోయి పాకిస్తాన్ ఫైనల్ కు చేరలేకపోయింది. 2022 టీ20 ఆసియా కప్ లో పాకిస్తాన్ రెండో స్థానంలో నిలిచింది.

ఆసియా కప్ 2025 కోసం పాకిస్తాన్ జట్టు: సల్మాన్ అలీ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాట్, ఖుష్దిల్ షా, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఉస్మాన్ ఖాదిర్, సుఫియాన్ ముఖీమ్.

Read more Photos on
click me!

Recommended Stories