Yashasvi Jaiswal Girlfriend: భారత క్రికెట్ జట్టు యంగ్ ప్లేయర్, ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరఫున, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో తన క్రికెట్ ప్రయాణం కొనసాగిస్తూ స్టార్ ప్లేయర్ ఎదిగాడు. నిరంతరం అద్భుతమైన ఇన్నింగ్స్ తో పరుగులు సాధిస్తున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా చాలా పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరిగే 2 టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో యశస్వి జైస్వాల్ చాలా పరుగులు చేసే అవకాశం ఉంది. తొలి టెస్టుకు ఎంపిక చేసిన జట్టులో అతనికి చోటు కల్పించారు.
25
yashasvi jaiswal.jp
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు సిరీస్‌లో యశస్వి అద్బుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లో 712 పరుగులు చేశాడు. ఈ సిరీస్ లో జైస్వాల్ బ్యాటింగ్ సగటు 89 శాతంగా ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించాడు.
ఇప్పుడు బంగ్లాదేశ్‌పై అదే ఫామ్‌ను కొనసాగించాలని యశస్వి భావిస్తున్నాడు. తన టెస్టు కెరీర్‌లో 9 మ్యాచ్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల్లో 1028 పరుగులు చేశాడు. ఈ కాలంలో అతని సగటు 68.53. యశస్వి అత్యధిక స్కోరు 214 పరుగులు.
35
yashasvi jaiswal 8.jp
క్రికెట్ లో అదరగొడుతూ స్టార్ గా ఎదిగిన యశస్వి జైస్వాల్ ప్రేమలో పడ్డాడని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా వీరి గురించి చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే జైస్వాల్ ప్రేయసి ఎవరు? ఏం చేస్తుంటారు? ఎలా పరిచయం అంటూ ఇలా పలు ప్రశ్నలతో సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
గత సీజన్ ఐపీఎల్ 2024 లో యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 15 ఇన్నింగ్స్‌ల్లో 435 పరుగులు చేశాడు. అయితే, ఈ సీజన్ లోనే జైస్వాల్ ఒక అమ్మాయితో కలిసి కనిపించడం వైరల్ గా మారింది. ఆమె తన స్నేహితురాలు మాడ్డీ హామిల్టన్. చెన్నై విమానాశ్రయంలో వీరు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో జైస్వాల్ ఆడిన మ్యాచ్ లలో హామిల్టన్ కూడా స్టేడియంలో కనిపించారు.
45
yashasvi jaiswal 6
మ్యాడీ హామిల్టన్ ఎవరు?
హామిల్టన్-యశస్వి జైస్వాల్ గురించి పుకార్లు పెరుగుతున్నప్పటికీ, జైస్వాల్ ఇంకా ఆమె సంబంధంపై వ్యాఖ్యానించలేదు. గత మూడేళ్లుగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారని పలు మీడియా కథనాల సమాచారం. మ్యాడీ హామిల్టన్ బ్రిటన్ నివాసి. హామిల్టన్ ప్రస్తుతం చదువుతున్నాడు.
అయితే, తరచుగా ఇండియా మ్యాచ్‌ల సమయంలో స్టాండ్స్ నుండి జైస్వాల్‌ని ఉత్సాహపరుస్తూ ఆమె చాలా సార్లు కనిపించారు. జనవరిలో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో స్టాండ్స్‌లో కనిపించారు.
55
Yashasvi Jaiswal
జైస్వాల్ కు హామిల్టన్ సోదరుడితో దోస్తాన్
మీడియా నివేదికల ప్రకారం హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు భారత జెర్సీ ధరించిన ఇంగ్లీష్ అమ్మాయిలలో ఒకరు మాడీ హామిల్టన్. ఐపీఎల్ 2024 సీజన్‌లో హామిల్టన్ చాలా మ్యాచ్‌లలో జైస్వాల్‌కు మద్దతుగా కనిపించారు. అలాగే, జైస్వాల్-హామిల్టన్ చాలాసార్లు కలిసి కనిపించారు.
వీరిద్దరికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైస్వాల్-హామిల్టన్ సోదరుడు హెన్రీ ఒకరికొకరు మంచి స్నేహితులు. దీంతో జైస్వాల్ కు హామిల్టన్ కూడా మంచి స్నేహం ఉందని సమాచారం.