బుమ్రాకు బిగ్ షాక్ - వివాదాస్ప‌ద‌మ‌వుతున్న‌ బీసీసీఐ నిర్ణయం

First Published | Sep 10, 2024, 3:00 PM IST

Big shock for Jasprit Bumrah: టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్ గా, వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ జ‌స్ప్రీత్ బుమ్రా రికార్డులు సృష్టించాడు. ఐసీసీ పురుషుల ర్యాంకింగ్స్ లో మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్ సాధించిన తొలి బౌలర్ గా కూడా ఘ‌న‌త  సాధించాడు. 
 

Rohit Sharma, cricket, Jasprit Bumrah,

Big shock for Jasprit Bumrah: టెస్టు క్రికెట్, వ‌న్డే క్రికెట్, టీ20 క్రికెట్ ఇలా  ప్ర‌తి ఫార్మాట్ లో అద్భుత‌మైన బౌలింగ్ తో రికార్డుల మోత మోగిస్తూ స్టార్ బౌల‌ర్ గా కొన‌సాగుతున్నాడు భార‌త పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా. టెస్టు క్రికెట్ లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్ గా రికార్డు సృష్టించిన ఈ స్టార్ క్రికెట‌ర్ టెస్టు క్రికెట్ లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఘ‌న‌త సాధించాడు. 

మొత్తంగా టెస్టు క్రికెట్ లో అద్భుత‌మైన రికార్డు కెరీర్ క‌లిగిన బుమ్రా విష‌యంలో భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఇప్పుడు తీసుకున్న నిర్ణ‌యం క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

Kohli-Bumrah

బుమ్రాకు బీసీసీఐ షాక్

సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో జరిగే 2-టెస్టుల సిరీస్‌కు విశ్రాంతి ఇవ్వనున్నార‌నే చర్చల మధ్య జస్ప్రీత్ బుమ్రాను కూడా జట్టులో చేర్చారు. ఆశ్చర్యకరంగా తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో అతని పేరు కూడా ఉంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కూడా దాదాపు 20 నెలల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చాడు. 

Latest Videos


వైస్ కెప్టెన్సీపై బీసీసీఐ షాకింగ్ నిర్ణయం

టెస్టు సిరీస్ కోసం ప్ర‌క‌టించిన భార‌త జ‌ట్టులో కొంత మంది సీనియ‌ర్ స్టార్ ప్లేయ‌ర్లు ఎంట్రీ ఇవ్వ‌గా, మరికొందరు కీలక ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. అయితే, వైస్ కెప్టెన్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ తన చివరి టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడినప్పుడు, జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, ఈసారి అలాంటి పాత్రను సెలెక్టర్లు ఇవ్వలేదు. అయితే, బుమ్రా విష‌యంలో వైస్ కెప్టెన్ ను సెల‌క్ట‌ర్లు ఎందుకు తొల‌గించారని క్రికెట్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ న‌డుస్తోంది.

రాహుల్-పంత్‌లకు కూడా వైస్ కెప్టెన్సీ దక్కలేదు

జ‌ట్టులో స్టార్ ప్లేయ‌ర్లుగా ఉన్న కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీలతో పాటు బుమ్రా జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకరిగా కొన‌సాగుతున్నాడు. కోహ్లీకి అధికారికంగా నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేరు. ఎందుకంటే అతను ఇప్పటికే జట్టుకు కెప్టెన్‌గా ప‌నిచేసి వైదొలిగాడు. అతని స్థానంలో రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. మరోవైపు భారత టెస్టు జట్టు కెప్టెన్సీ రేసులో రాహుల్, పంత్ కూడా ఉన్నారు. అయితే, వీరిద్దరూ బంగ్లాదేశ్ టెస్టుకు టీమ్ లో ఉండ‌గా, వీరికి కూడా వైస్ కెప్టెన్సీని ఇవ్వ‌లేదు. 

Jasprit Bumrah-Hardik Pandya

చాలా రోజుల త‌ర్వాత టెస్టు టీమ్ లోకి విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి చాలా కాలం త‌ర్వాత జ‌ట్టులోకి తిరిగి వ‌చ్చాడు. తన రెండో బిడ్డ పుట్టినందుకు విరామం తీసుకోవడంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ టెస్టు ఫార్మాట్ లోకి మ‌ళ్లీ వ‌స్తున్నాడు. 

ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా జ‌ట్టులోకి తిరిగి వ‌స్తాడ‌ని క్రికెట్ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగింది. అయితే, అతనిని జట్టులో చేర్చుకోలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్‌క్యాప్డ్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ ఈ సిరీస్ తో అరంగేట్రం చేయ‌నున్నాడు.

మహ్మద్ షమీని ఎందుకు తీసుకోలేదు?

డిసెంబర్ 2022 వరకు మిర్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టు ఆడిన కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో పంత్ గాయపడ్డాడు. దాదాపు సంవ‌త్స‌రం త‌ర్వాత ఐపీఎల్ తో గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు టెస్టు జ‌ట్టులోకి కూడా వ‌చ్చాడు. ఇక మహ్మద్ షమీ టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ నుంచి ష‌మీ గాయంలో బాధ‌ప‌డుతున్నాడు. ప్ర‌స్తుతం ఎన్సీఏ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న అత‌ను ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గతంలో షమీ ఫిట్‌నెస్ సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేసినా అది జరగలేదు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, , జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.

click me!