సొంత విమానాలున్న భార‌త క్రికెట‌ర్లు ఎవ‌రో తెలుసా?

First Published | Jul 21, 2024, 9:38 PM IST

Indian cricketers who own a private jet :  భార‌త క్రికెట‌ర్ల‌లో చాలా మంది ల‌గ్జ‌రీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వారి కృషికి త‌గిన ఫ‌లితాన్ని అందుకుని ముందుకు సాగుతున్నారు. ల‌గ్జ‌రీ కార్లతో పాటు సొంత ప్రైవేట్ జెట్ ల‌ను క‌లిగిన ఉన్న భార‌త క్రికెట‌ర్లు కూడా ఉన్నారు. 
 

భార‌త క్రికెట్ లో సొంత ప్రైవేట్ జెట్ లను క‌లిగి ఉన్న ఆట‌గాళ్ల‌లో లెజెండ‌రీ ప్లేయ‌ర్ సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ తో పాటు యంగ్ ప్లేయ‌ర్లు కూడా ఉన్నారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.. 

హార్దిక్ పాండ్యా

భార‌త స్టార్ ఆల్ రౌండ‌ర్ల‌లో ఒక‌రు హార్దిక్ పాండ్యా. భారత జాతీయ క్రికెట్ జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్ గా ఉన్న హార్దిక్ వివిధ టోర్న‌మెంట్లు, చాలా సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉంటూ భారీగానే డ‌బ్బును అందుకుంటున్నాడు. విజ‌య‌వంత‌మైన ప్లేయ‌ర్ కెరీర్ ను కొన‌సాగిస్తున్న హార్దిక్ పాండ్యాకు ఓ ప్రైవేట్ జెట్ కూడా ఉంది.


విరాట్ కోహ్లీ

ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లికి లగ్జరీ, సౌలభ్యం పట్ల ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. కింగ్ కోహ్లీకి సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇది అత‌ని స‌క్సెస్, సంపదకు నిదర్శనం. ఈ విమానంలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.

ఎంఎస్ ధోని

క్రికెట్ మూడు ఫార్మాట్ ల‌లో భార‌త జ‌ట్టును ఛాంపియ‌న్ గా నిల‌బెట్టిన కెప్టెన్ ఎంఎస్ ధోని. మూడు వైట్ బాల్ ఐసీసీ టోర్నమెంట్‌లను గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్ గా చ‌రిత్ర సృష్టించాడు. ఎంఎస్ ధోని కూడా ఒక‌ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నాడు.

కపిల్ దేవ్

క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. అతని నాయకత్వం, అద్భుత‌మైన వ్యక్తిగ‌త ప్రదర్శనతో 1983లో భార‌త స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. చారిత్రాత్మక ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఈ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన  కపిల్ దేవ్ కు కూడా ఒక ప్రైవేట్ జెట్ ఉంది. 

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ క్రీడా చరిత్రలో గొప్ప క్రికెటర్. తన కెరీర్ మొత్తంలో అనేక రికార్డులు, ప్రశంసలను సాధించాడు. "గాడ్ ఆఫ్ క్రికెట్" గా గుర్తింపు సాధించాడు. అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒక‌రిగా ఉన్న స‌చిన్ టెండూల్క‌ర్ కూడా ఒక ప్రైవేట్ జెట్ ను క‌లిగి ఉన్నారు. 

Latest Videos

click me!