Hardik Pandya- Natasa: హార్దిక్ పాండ్యా- నటాషా: ప్రేమ నుంచి విడాకుల వరకు.. ఏం జరిగింది?

First Published | Jul 21, 2024, 12:24 PM IST

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అత్యంత వివాదాస్పద ఆటగాళ్లలో ఒకరు. పాండ్యా క్రికెట్‌లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ వివాదాస్పద వ్యక్తే. అలాగే, నటాషాతో వైవాహిక బంధం కూడా నాలుగేళ్లలోనే తెగదెంపులైంది. విడిపోవడానికి వీరిద్దరి మధ్య ఏం జరిగింది. హార్దిక్- నటాషాల ప్రేమ నుంచి విడాకుల వరకు రీవైండ్ చేద్దాం.

 

Hardik- Natasa

హార్దిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టులోని ముఖ్యమైన ఆల్ రౌండర్లలో ఒకరు. తన అద్భుతమైన బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో క్లిష్ట సమయాల్లో భారత జట్టును పలుమార్లు గెలిపించాడు. అయితే, ఇటీవలి ఐపీఎల్‌లో అతనికి అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అతని వ్యక్తిగత జీవితం కూడా ప్రభావితమైంది. చివరికి తన భార్యతో విడిపోవాల్సి వచ్చింది. 

హార్దిక్‌- నటాషా ఎలా కలిశారంటే..?

హార్దిక్‌ పాండ్యా, సెర్బియా మోడ‌ల్ నటాషా స్టాంకోవిచ్ కొన్నేళ్ల క్రితం అర్ధరాత్రి ఓ నైట్ క్లబ్‌లో కలుసుకున్నారు. ఆ సమయంలో హార్దిక్ వేషధారణ, స్టైల్, ఎక్స్ ప్రెషన్స్ డిఫరెంట్‌గా ఉండటంతో నటాషా చూసి వెళ్లిపోయింది. అప్పుడు ఇద్దరూ తమ తమ రంగాల్లో బాగా పాపులర్‌గా ఉన్నారు.


2020లోనే పరిచయం.. ప్రపోజల్స్

సాధారణంగా ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు. ముందుగా ప్రేమలో పడతారు, డేటింగ్ చేస్తారు, ఆ తర్వాత నిశ్చితార్థం చేసుకుంటారు. అయితే ఈ విషయంలో హార్దిక్ కాస్త డిఫరెంట్‌. లవ్‌ ప్రపోజ్‌ చేసిన రోజే నిశ్చితార్థం చేసుకున్నాడు. 
హార్దిక్‌- నటాషా ఫ్రెండ్స్‌ అయ్యాక 2020 న్యూ ఇయర్ సందర్భంగా డేటింగ్‌కి వెళ్లారు. సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు హార్దిక్ నటాషాకు ప్రపోజ్ చేశాడు. వేలిక ఉంగరం తొడిగి లిప్ లాక్ ముద్దుతో లవ్ ప్రపోజల్ చేశాడు. ఇలా ప్రపోజల్‌, నిశ్చితార్థం ఒకేసారి జరిగాయి.

పెళ్లయిన రెండు నెలలకే డెలివరీ

హార్దిక్ పాండ్యా- నటాషా స్టాంకోవిచ్ వివాహం 2020 మే 31న వివాహం చేసుకున్నారు. అదే సంవత్సరం జూలై 30న మగబిడ్డ అగస్త్యకు జన్మనిచ్చారు.

ఆ తర్వాత 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్‌ సెలబ్రేషన్స్ మధ్య తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. 

విడిపోవడానికి కారణమేమిటి?

హార్దిక్ పాండ్యా, నటాషా విడివిడిగా ఉంటున్నారని కొన్ని నెలలుగా మీడియాలో పుకార్లు వచ్చాయి. అదే సమయంలో ఇటీవల జరిగిన ఐపీఎల్ హార్దిక్ పాండ్యాకు పీడకలలా మారింది. అదే సమయంలో, నటాషా తన పాత స్నేహితులతో కలిసి తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

తాజాగా, అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహానికి హాజరైన హార్దిక్ పాండ్యా అకస్మాత్తుగా నటాషా నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. అనేక ట్విస్టుల అనంతరం ఈ విషయం ప్రకటించిన పాండ్యా... ‘‘మేమిద్దరం విడిపోయాం. మా స్నేహం కొనసాగుతుంది.’’ అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అయితే, వీరిద్దరూ విడిపోవడానికి కారణాలేంటని అభిమానులు అయోమయంలో పడ్డారు.

Latest Videos

click me!